కోస్గి, జూన్ 19 : మున్సిపాలిటీలోని మల్రెడ్డిపల్లికి చెందిన కామారం నరేశ్ పురుగులమందు తాగి ఆదివారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతూ మృ తి చెందారు. నరేశ్ మృతి చెం దిన విషయం తెలుసుకొని ఎ మ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గ్రామానికి వెళ్లి పార్థివదేహం పై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నరేశ్ మృతి టీఆర్ఎస్ పార్టీకి తీరని లో టని ఎమ్మెల్యే అన్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా లో ఉత్సాహంగా ఉండే వ్యక్తి మృతి చెందడం బాధాకరమన్నారు.
ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎమ్మెల్యే రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన భార్యకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఆయన పిల్లలను ఉచితంగా చదివిస్తామన్నా రు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ఎ క్స్గ్రేషియా ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అం త్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.