గోపాల్పేట, జూన్ 19 : తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం వచ్చే ఆయిల్‌పాం సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. మండలంలోని మున్ననూర్ గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు రూ.9 లక్షలతో, మండల పరిషత్ నిధులు రూ. 17 లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అడ్డాకుల ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని గ్రామస్తులు మంత్రిని కోరగా అర్హులైన వారికి త్వరలోనే అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తరగతి గదుల నిర్మాణ పనులు నాణ్యతగా, త్వరగా చేపట్టాలన్నారు.
పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వనపర్తి సెయింట్ థామస్ స్కూల్ నుంచి అప్పాయిపల్లి, మున్ననూర్ మీదుగా జయన్న తిరుమలాపూర్ వరకు 7 కి.మీ. బీటీ రోడ్డు రెన్యూవల్‌కు ప్రభుత్వం నుంచి రూ.కోటీ 25 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఎస్సీ రైతుల పొలాలకు నీటి సౌకర్యం కల్పిస్తూ, ఆయిల్‌పాం ప్లాంటేషన్ చేయించనున్నట్లు వివరించారు. ఈ తోటల సాగులో అంతర పంటగా కూరగాయల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు.
కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌గౌడ్, హెచ్ఎం శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, విండో చైర్మన్ రఘుయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, కోఆప్షన్ సభ్యులు మతీన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, సర్పంచులు శేఖర్‌యాదవ్, శ్రీనివాసులు, శంకర్‌నాయక్, ఎంపీటీసీలు బాల్‌రెడ్డి, నరేందర్, ఎస్ఎంసీ చైర్మన్ బాలపీరు, నాయకులు కోటీశ్వర్‌రెడ్డి, రాజు, శేషిరెడ్డి, అమరేందర్‌రెడ్డి, జగన్నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, రాజేశ్‌గౌడ్, జైపాల్‌నాయక్, వర్నెరాజు, వెంకటయ్య, సురేశ్, రవి, నాగరాజు, రాజబాబురెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.