మూసాపేట, జూన్ 18 : రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఏడీఏ యశ్వంత్‌రావు సూచించా రు. శనివారం అడ్డాకులలోని తిరుమల ట్రైడర్స్, ధనలక్ష్మి, రైతుమిత్ర సంఘం, శ్రీదేవి ఫర్టిలైజర్స్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో విత్తనాలు అమ్మిన రికార్డులు, వచ్చిన స్టాక్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తీసుకున్న రసీదు పంట దిగుబడి చేతికొచ్చే వరకు భద్రపరుచుకోవాలన్నారు. ఏడీఏ వెంట ఏవో శ్రీనివాసులు, ఎస్సై విజయ్‌కుమార్ తదతరులు ఉన్నారు.
జీలుగ సాగుతో లాభాలు
తక్కువ సారవంతమైన భూములకు నేల స్వభావాన్ని బట్టి పచ్చిరొట్ట ఎరువుల సాయంతో భూమి సారవంతంగా మార్చుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి గోపినాథ్ రైతులకు సూచించారు. శనివారం బాదేపల్లి శివారులోని రైతు ఎక్బాల్ పొలంలో క్షేత్రప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీలుగ విత్తనాలు చల్లడం ద్వారా పచ్చిరొట్ట ఎరువులు లభిస్తాయని తెలిపారు. జీలుగ సాగు మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఎకరాకు 10నుంచి 12కిలోల జీలుగ విత్తనాలను చల్లాలని, విత్తనాలు చల్లిన 25నుంచి 30రోజులలోగా పంట ఏపుగా పెరుగుతుందన్నారు. పూతదశలో భూమిలో కలియదున్నడం వల్ల అవి కుళ్లి మొక్కలకు సారవంతమైన భూమిని అందిస్తుందన్నారు. అలా దున్నిన తర్వాత 100కిలోల సూపర్పాస్పేట్ను దుక్కిలో వేయాలన్నారు. సూపర్‌పాస్పేట్ వల్ల మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువులు తయారవుతాయన్నారు. విత్తనాలకు ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో నర్సింహులు, రాజేందర్‌రెడ్డి, శ్రీశైలం, వెంకటయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.