కొల్లాపూర్, జూన్ 17 : కొల్లాపూర్ పట్టణంలో శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికైన తరువాత మంత్రి కేటీఆర్ తొలిసారిగా కొల్లాపూర్ పట్టణానికి రానున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు కొల్లాపూర్ బస్ డిపో సమీపంలోని అయ్య ప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ముందుగా పట్టణంలో రూ.170 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శం కుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీచైర్‌పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే లు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
అభివృద్ధి పరుగులు..
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ రాములు సహకారంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ద్ధన్రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.50 లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్వాసితులకు న్యాయపరంగా పరిహారం డబ్బులు ఇప్పించడంలో ఎమ్మెల్యే బీరం చురుకైన పాత్ర పోషించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మరుగునపడిపోయిన పలు వాగులపై వంతెనలు నిర్మించారు. గ్రామీణ ప్రాంతాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించారు. రామాపురం శివారులో రూ.7 కోట్ల వ్యయంతో ఎంసీహెచ్ దవాఖాన, పలు మండలాలకు సొంత డబ్బులతో అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. సోమశిల-సిద్ధేశ్వ రం వంతెనతోపాటు కల్వకుర్తి నుంచి వయా కొల్లాపూ ర్, నంద్యాల వరకు నాలుగు వరుసల రోడ్డు పనులకు సీఎం కేసీఆర్‌తో ఒప్పించారు.కొత్తగా ఏర్పడిన కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే సైడ్‌డ్రైన్, సీసీరోడ్లు నిర్మించారు. రూ.2 కోట్లతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మా ర్కెట్ నిర్మాణ పనులు త్వరలో కొనసాగుతున్నాయి. రూ.10 కోట్ల వ్యయంతో పట్టణ చౌరస్తాల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు.
గులాబీమయంగా కొల్లాపూర్..
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కొల్లాపూర్ పట్టణం గులాబీమయంగా మారింది. గులాబీ తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, ఆర్చీలు ఏర్పాటు చేశారు. రాజా ప్యాలెస్ వద్ద జరిగే బహిరంగసభ వేదిక ను అందంగా తీర్చిదిద్దారు. సభకు సుమారు 70 వేల మందిని తరలించేందుకు నాయకులు సమాయాత్తమవుతున్నారు. వేదిక ప్రాంగణం మొత్తం చలువపందిళ్లు వేశారు. బస్‌డిపో వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ పనులను ఎమ్మెల్యే బీరం, డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, సీఐ యాలాద్రి పర్యవేక్షించారు.