రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతితో కలిసి పలు అభివృద్ధి పనులకు హాజరయ్యారు. ఎన్టీఆర్ స్టేడియంలో 48 మంది దళితబంధు పథకం లబ్ధిదారులకు ట్రాక్టర్లు, కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గిరిజన బిడ్డల ప్రయోజనం కోసం గురుకుల బాలికల పాఠశాలను మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 17 : పాలమూరు జిల్లా కేంద్రంలో చేపట్టిన పర్యాటక పనులను పరుగులు పెట్టించాలని అధికారులను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న మినీ ట్యాంక్‌బండ్, ఐలాండ్, నెక్లెస్ రోడ్డు, తీగల వంతెన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు షిఫ్టుల్లో పనులు చేపట్టి మినీట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు ను వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రానికే తలమానికంగా నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ముమ్మరం గా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి పర్యవేక్షించాలన్నారు. త్వరగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు అద్భుత పర్యాటక ప్రదేశాన్ని అందుబాటులో తీసుకొచ్చే సంకల్పంతో ఉ న్నట్లు తెలిపారు. పనులు పూర్తయ్యాక కృష్ణా జలాలతో మినీ ట్యాంక్‌బండ్‌ను నింపుతామని చెప్పారు. వర్షాలు పడినా పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మం త్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మ న్ గంజివెంకన్న, కౌన్సిలర్లు, ఇరిగేషన్ ఎస్ఈ చక్రధర్, డీఈ మనోహర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఐదు నెలల్లో హజ్‌హౌస్‌ను నిర్మించాలి..
మహబూబ్‌నగర్, జూన్ 17 : హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల సౌకర్యార్థం మహబూబ్‌నగర్‌లో హజ్‌హౌస్ ను నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. ఏనుగొండలో హజ్ భవనాన్ని నిర్మించేందుకు స్థలం కేటాయించడంతోపాటు రూ.50 లక్షల నిధులను మంత్రి విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన కా పీని శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, కౌ న్సిలర్ అంజాద్, ఎండీ ఇజాజ్ అహ్మద్, హమీరుద్దీన్ కు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్ వెనుకాల హజ్‌హౌస్‌కు స్థలం కే టాయించామన్నారు. ఈ భవనం పూర్తయితే హజ్‌యాత్రకు వెళ్లే వారికి శిక్షణ, వ్యాక్సినేషన్, ఇతర కార్యక్రమాలతో పాటు యాత్రికులందరినీ కోఆర్డినేషన్ చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. మంత్రి వెంట మోసిన్, భా స్కర్‌రావు తదితరులు ఉన్నారు.
ప్రధానిది అనాలోచిత నిర్ణయం
మహబూబ్‌నగర్, జూన్ 17 : సైనిక బలగాల నియామకంపై ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతోనే ఆందోళనలు కొనసాగుతున్నాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశ భవిష్యత్, రక్షణ ఎంతో బలంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ కేంద్రం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్మెంట్ సరైన నిర్ణయం కాదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఘటనలో చనిపోయిన వరంగల్‌కు చెందిన రాకేశ్ కుటుంబానికి మంత్రి సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. మృతి చెందిన రాకేశ్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. వారు తిరిగబడే సరికి మోదీ సర్కార్ వెనుకడుగు వేసిందన్నారు. మళ్లీ ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో యువతను మోసం చేయడానికి చూస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా నేటికీ నోటిఫికేషన్ ప్రకటించడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఘటనలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి డిమాండ్ చేశారు.