కృష్ణ, జూన్ 17 : పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు పట్టణ ప్రగతి గొప్ప కార్యక్రమమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కున్సిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరసతీదేవి విగ్రహావిష్కరణ, క్రీడా మైదానం, హిందూపూర్‌లో కస్తూర్బా గాంధీ పాఠశాల నూ తన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, అదనపు కలెక్టర్ రాంచంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. అనంతరం వాలీబాల్ క్రీడలో ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణా ల్లో ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్ జెంప్ మై దానాలు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం గ్రామాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో క్రీడా ప్రాంగాణాలను మినీ స్టేడియంలుగా తీర్చిదిద్దుతామన్నా రు. కస్తూర్బా గాంధీ బాలికల ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రారంభించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ఆడపిల్లలు మగవారికి సమానంగా ఎదగాలని, ఆడపిల్లలకు ప్ర భుత్వ పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పూ ర్ణిమాపాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మ, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు విజయ్‌పాటిల్, ప్రధానకార్యదర్శి మెనేశ్, సర్పంచులు, పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల యువ నాయకుడు శివరాజ్‌పాటిల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివప్ప, ఎంపీడీవో శ్రీనివా సులు, తాసిల్దార్ రామకోటి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేస్తుంది
మక్తల్ టౌన్, జూన్ 17 : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభు త్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని 11వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం పసులగేరి, బురాన్గడ్డలో ఎమ్మెల్యే పర్యటించారు. వార్డు ప్రజలతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించి వార్డు కమిటీ స భ్యులతో సమస్యలను అడిగి తెలుసుకొని మున్సిపల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అఖిల, కమిషనర్ నర్సింహ, ఏ ఈ నాగశివ, కౌన్సిలర్ అర్చన, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ రె డ్డి, నాయకులు మల్లికార్జున్, రాజశేఖర్‌రెడ్డి, గోపిరెడ్డి పాల్గొన్నారు.
ముమ్మరంగా…
నారాయణపేట, జూన్ 17 : పట్టణంలోని వివిధ వా ర్డుల్లో శుక్రవారం పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగాయి. 2, 3, 5, 8, 10, 11, 16తోపాటు ఇతర వా ర్డుల్లో కౌన్సిలర్లు, వార్డుల ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. ఆయా వార్డుల్లో మురుగు కాలువలు శుభ్రపర్చడం, కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం, శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చడం, డ్రైనేజీలు శుభ్రం చేయడం, జేసీబీ సహాయంతో కంపచెట్ల తొలగింపు, చెత్తా చెదారం తొలగించడం, తాగునీటి పైప్లైన్లకు మరమ్మతులు చేయడం తదితర పనులు చేశారు. కార్యక్రమాలలో ఆయా వార్డుల కౌన్సిలర్లు అనిత, గురులింగప్ప, అమీరుద్దీన్, శిరీష తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
నారాయణపేట టౌన్, జూన్ 17 : ప్రతిఒక్కరూ మొక్క లు నాటి వాటిని సంరక్షించాలని వార్డు కౌన్సిలర్ అనిత అ న్నారు. పట్టణంలోని 2వ వార్డులో పట్టణ ప్రగతిలో భా గంగా శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు ప ర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని, ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. వా ర్డులో పచ్చదనం వెల్లివిరియాలంటే రోడ్డుకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, వార్డు అధ్యక్షుడు దేవరాజ్, వార్డు అధికారి సంతోషి, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పనులు
నారాయణపేట రూరల్, జూన్ 17 : మండలంలోని బోయిన్పల్లి, ఊటకుంటతండా, సింగారం, పేరపళ్ల, జాజాపూర్, కొల్లంపల్లితోపాటు ఇతర గ్రామాల్లో శుక్రవారం పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని బోయిన్‌పల్లిలో పల్లె ప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో సందీప్‌కుమార్, ఎంపీవో రాజు పరిశీలించారు. అలాగే గ్రామంలోని నర్పరీని పరిశీలించి హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గ్గొన్నారు.
అదనపు కలెక్టర్ పర్యటన
మాగనూర్, జూన్ 17 : మండలంలో పల్లె ప్రగతిలో భాగంగా అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీవో రాంచంద ర్, తాసిల్దార్ తిరుపతి కలిసి శుక్రవారం వివిధ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించా రు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుం టే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నా రు. పర్యటన సందర్భంగా మార్గమధ్యంలోని వర్కూర్లో ఇసుక ట్రాకర్లు వెళ్తుడడంతో వాటిని నిలిపివేసి అనుమతుల పై ఆర్డీవో రాంచందర్‌ను వివరాలు అడుగగా పత్రాలు లేక పోవడంతో ఎస్సై నరేందర్‌కు ఫోన్ చేశారు. ఇసుక ట్రాక్టర్ల ను పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని సమాచారమివ్వడంతో ఎస్సై స్టేషన్‌కు తరలించారు. విషయంపై ఎస్సైని విచారణ కోరగా వర్కూర్లో అనుమతితోనే ఇసుక తరలిస్తున్నారని, అధికారులు పట్టుకున్న సమయానికి అనుమతి పత్రాలు లేకపోవడంతో చూపించలేదని, అందుకు స్టేషన్‌కు తీసుకొ చ్చామన్నారు. రెండు గంటల సమయం తర్వాత కలెక్టర్ కార్యాలయం నుంచి అనుమతి పత్రాలు చూపించడంతో ట్రాక్టర్లను వదిలివేశామన్నారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎస్సై తెలిపారు.