ఊట్కూర్, జూన్ 17 : మండలకేంద్రంలో బొడ్రాయి ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీరాంనగర్, శివాజీనగర్, పాతపేట, మెయిన్బజా ర్ హనుమాన్ ఆలయం, ఈశ్వర్మందిర్, ఎల్బీనగర్, నీళ్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద వేదపండితుల ఆధ్వర్యం లో ప్రాతఃకాల మండప పూజ, దుర్గా హోమం, నృసింహస్వామి హోమం, మృత్యుంజయ హోమం, సుదర్శన హో మం, బలిహరణ, పూర్ణాహుతి, యంత్ర ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ, కుంభం, ప్రాణ ప్రతిష్ఠ, ఆశీర్వచనం నిర్వహించా రు. సంప్రదాయ వేడుకలను పు రస్కరించుకొని ఆడపడుచులు పెద్దసంఖ్యలో పుట్టింటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పురోహితుడు భీమాచార్యులు మా ట్లాడుతూ నాభిశిల ప్రతిష్ఠ చా లా విశిష్టమైనదని పేర్కొన్నారు. నాభిశిల దేవతా అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు. మహిళలు మంగళహారతులతో దర్శించుకొని నైవేద్యం సమర్పించుకున్నారు. గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ని ర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, ఎంపీటీసీ హనుమంతు, నాయకులు శ్రీహరి, కొండయ్య, భాస్కర్, అరవింద్‌కుమార్, ఆశిరెడ్డి, శివరామరాజు, ఆశప్ప, కొండ న్ గోపాల్, కృష్ణయ్యగౌడ్, రఘువీర్, రాముగౌడ్ తదితరు లు బొడ్రాయిని దర్శించుకుని పూజలు చేశారు.