ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి
జిల్లా విద్యాధికారి లియాఖత్ అలీ
పాఠశాల రికార్డుల తనిఖీ
ఊట్కూర్, జూన్ 17 : ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేపట్టి విద్యార్థులను ఉన్నతులుగా తీ ర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జి ల్లా విద్యాధికారి లియాఖత్ అలీ అన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి లోటుపా ట్లు లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయురాలు గాయత్రిని ఆదేశించారు. విద్యార్థుల ప్రతిభను పరీక్షించి పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో అకాడమిక్ మా నిటరింగ్ అధికారి విద్యాసాగర్, జిల్లా బాలిక విద్యా అభివృద్ధి అధికారి పద్మానళిని, సెక్టోరల్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం
నర్వ, జూన్ 17 : మండలంలోని ఉందేకోడ్ అంగన్వా డీ సెంటర్-3లో శుక్రవారం చిన్నారుల కు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు ఉపాధ్యాయురాలు అనురాధ తె లిపారు. పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ నుం చి అందించే పౌష్టికాహారం, గర్భిణులు ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అలాగే ప్రీస్కూల్ కార్యక్రమాలపై తల్లిదండ్రులకు వివరించి మూడేండ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలస్వామి,గ్రామస్తులు పాల్గొన్నారు.
వందకుపైగా అడ్మిషన్లు
మక్తల్ టౌన్, జూన్ 17 : మక్తల్ ప్రభుత్వ బాలుర ఉ న్నత పాఠశాలలో ఇప్పటికే వందకుపైగా అడ్మిషన్లు అయ్యాయని ప్రధానోపాధ్యాయుడు అనిల్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రా మాల నుంచి వచ్చిన విద్యార్థుల అడ్మిషన్లు శుక్రవారం తీ సుకున్నారన్నారు. ఈ సందర్భంగా అనిల్‌గౌడ్ మాట్లాడు తూ పాఠశాలలో ఇప్పటికే అడ్మిషన్ల సంఖ్య వంద దాటింద ని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంగ్లిష్ మీడియంలో కూడా అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ఉం టుందన్నారు. మౌలిక వసతులు కల్పన, నాణ్యమైన భోజ నం అందజేత, ఆంగ్ల విద్యాబోధన తదితర అంశాలపై ప్రవేశాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఉ పాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.