మరికల్, జూన్ 17 : మండలంలోని చిత్తనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యా హ్న భోజనం అందించాలని గ్రామస్తులు శుక్రవారం డి మాండ్ చేశారు. పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు మండల విద్యాధికారి అంజలీదేవితో మాట్లాడుతూ గతంలో ఉన్న ఏజెన్సీ వారు విద్యార్థులకు సక్రమంగా మధ్యాహ్న భోజనం అందించలేదన్నా రు.
పాఠశాలలు ప్రారంభమైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందు కోసం నూతన ఏజెన్సీని ఏర్పాటు చేసి ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిం చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంఈ వో మాట్లాడుతూ గ్రామస్తులంతా కలిసి మధ్యాహ్న భోజ నం పెట్టేందుకు ముందుకురావాలని, గతంలో ఉన్నవారికి బడ్జెట్ రాగానే బిల్లులు చెల్లిస్తామన్నారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు వారంలో ముడుసార్లు గుడ్లు వడ్డించాలని గ్రామస్తులకు సూచించారు. దీంతో ఏజెన్సీ కోసం ఇద్దరు మందుకురావడంతో త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో వారిని ఎంపిక చేసి సో మవారం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇ చ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దేవేందర్‌రెడ్డి, గ్రామ యువక మండలి సభ్యుడు మురళి, పాఠశాల ఎస్ఎంసీ చై ర్మన్ రవి, గ్రామస్తులు శివన్న, నరేందర్, బాలకృష్ణ, క్లస్టర్ హెచ్ఎం లక్ష్మి, సీఆర్పీ శివకుమార్ తదితరులు ఉన్నారు.