కల్వకుర్తి, జూన్ 17: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం మనందరిపై ఉందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. మండలానికి చెందిన 8మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యంతో కలిసి ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చెప్పే గాలిమాటలకు మోసపోవద్దని సూచించారు. ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదో విధంగా అందుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
తండాలకు నిధులు మంజూరు
కల్వకుర్తి, వెల్దండ,చారకొండ, ఊర్కొం డ, వంగూర్ మండలాల్లోని గిరిజన గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.25లక్షలు విడుదలయ్యాయన్నారు. కల్వకుర్తి మండలంలో తర్నికల్ తండా, జీడిపల్లి తండా, వెంకటాపూర్ తండా వెల్దండ మండలంలో అల్లంతోట బావి తండా, గానుగుగట్టు తండా, కేసీ తం డా, కుందారంతండా, ఎంజీ కాలనీతండా, మర్రి గుట్టతండా, నగర గట్టుతండా, పల్గు తండా, పోచమ్మగట్టుతండా, శంకరకొండ తండా, సిలోన్బావితండా, ఉబ్బల గట్టు తండా, చారకొండ మండలంలో కమాల్పూర్తండా, సారంబండతండా, ఊర్కొం డ మండలంలో బాల్యలోక్యాతండా, వం గూర్ మండలంలో రంగాపూర్ తండాల్లో జీపీ భవనాలు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
బీటీ రోడ్లకు రూ.35.07కోట్లతో ప్రతిపాదనలు
ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా కల్వకుర్తి, వెల్దండ, చారకొండ మండలాల్లోని గిరిజన తండాలకు బీటీ రోడ్లు నిర్మించేందుకు రూ. 35.07కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కల్వకుర్తి మండలంలోని వెంకటాపూర్ తండాకు రూ.70లక్షలు, జీడిపల్లి తండాకు రూ.70లక్షలు, ఎల్లికల్ తండా కు రూ.70లక్షలతో ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే వెల్దండ మండలంలోని నెమలిగుట్ట తండాకు రూ.2.50 కోట్లు, నారాయణపూర్‌కు రూ.2.45కోట్లు, కుందారం తం డాకు రూ.2.80 కోట్లు, లాలూ తండాకు రూ.1.40 కోట్లు, తిమ్మినోనిపల్లి- రాచూర్ రోడ్డుకు రూ.2.80 కోట్లు, శంకర్కొండతం డాకు 2.80 కోట్లు, గానుగుగట్టుతండాకు .2.40కోట్లు, అల్లంతోట బావితండాకు రూ.2.10కోట్లు, గొల్లోనిబావితండాకు రూ.3.50 కోట్లు, ఉబ్బలగట్టు తండాకు రూ.3.50కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే చారకొండ మం డలం సిలొన్బావి తండాకు రూ.4.90 కో ట్లు, ఎర్రవల్లి- బుగ్గతండాకు రూ.4.20 కోట్లతో ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి స్థల పరిశీలన
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.5కోట్లతో 2ఎకరాల స్థలంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పరిశీలించారు. ఈనెల 20వ తేదీన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు ముఖ్య అతిథిగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అలాగే అదే రోజు ఉదయం 10 గంటలకు కల్వకుర్తి జూనియర్ కళాశాల మైదానంలో కల్వకుర్తి, వెల్దండ మండలాలకు చెందిన 38మంది దళిత బంధు లబ్ధిదారులకు మం త్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా ట్రాక్టర్లు, కార్లను పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోహర, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహేద్, విజయ్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, షానవాజ్‌ఖాన్, తాసిల్దార్ రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, ఏఈ శివకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.