తిమ్మాజిపేట,జూన్ 17 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మనఊరు-మనబడి కార్యక్రమానికి చేయూతను ఇవ్వాలని ఎమ్మె ల్యే మర్రిజనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో మనఊరు-మనబడి, బడిబాట కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కని విద్యను అందించాలని తాము కష్టపడి సంపాదించి ప్రైవేట్ పాఠశాలలో లక్షలు పోసి చదివిస్తున్నారన్నారు.
ఇది గమనించిన సీఎం కేసీఆర్ రూ.7,500కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు శ్రీకారం చుట్టారన్నా రు. గత పాలకుల హయంలో నిర్వీర్యమైన ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా బలోపేతం చేస్తామన్నారు. సర్కారు బడుల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాల అన్న భావన విడనాడి విజ్ఞాన్ని అందించే దేవాలయాలైన సర్కారు బడుల బాగుకు గ్రామాల్లో దాతలు ముం దుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్‌కు చదువులు పేరిట లక్షలు ఖర్చుపెడుతున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ఉన్నతవిద్యావంతులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమక్షంలో కొందరు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారు. కార్యక్రమంలో డీఈ వో గోవిందరాజులు, ఎంఈవో శ్రీనివాసు లు జీహెచ్ఎం సుధాకర్, జిల్లా ఎస్టీ ఎస్సీ మానిటరింగ్ సభ్యులు జోగు ప్రదీప్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్, ఎంపీవో బ్రహ్మచారి, సర్పంచ్ బాలరాజు, రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ వెంకటస్వామి పాల్గొన్నారు.