అచ్చంపేట, జూన్ 16 : అచ్చంపేట ప్రాంతంలో శుక్రవారం రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ఐనోలు గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గిరిజన గురుకుల బాలికల పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. దళితబంధు కింద ఎన్నికైన నియోజకవర్గంలో ని లబ్ధిదారులకు అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియంలో కార్లు, ట్రాక్టర్లు, ఇతర యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఆశ్రమ పాఠశాల లో, జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యం లో పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో కొనసాగుతున్న నిరుద్యోగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో కొనసాగే మంత్రి పర్యటనలో భాగంగా వి ద్యార్థులతో ముచ్చటించనున్నారు.