హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించినట్టు తెలంగాణ ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతామని వెల్లడించింది.
www.tgsrtcbus.in వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది. శ్రీశైలం వెళ్లడానికి 30 మంది భక్తులు ఒకే చోట ఉంటే వారున్న వద్దకే బస్సును పంపుతామని వెల్లడించింది. ఏవైనా సందేహాలు ఉంటే 9959226149 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.