రాజాపూర్, జూన్ 13 : మండలంలో బడిబయట పిల్లలను గు ర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డీఈవో ఉషారాణి అ న్నారు. బడిబాటలో భాగంగా రంగారెడ్డిగూడలో విద్యార్థులతో కలిసి సోమవారం ర్యాలీ నిర్వాహించారు. ఈ సందర్భం గా ఆ మె మాట్లాడుతూ గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలి
చిన్నారుల భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాలకు పంపాలాని అంగన్వాడీ టీచర్లు అనిత, విజయలక్ష్మి అన్నారు. బడిబాటలో భాగంగా సోమవారం తిర్మలాపూర్‌లో అంగన్వాడీ టీ చర్లు ర్యాలీ నిర్వాహించారు. కార్యక్రమంలో కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎనమిదితండా ప్రాథమిక పాఠశాల పరిశీలన
హన్వాడ, జూన్ 13 : పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకుం డా ప్రభుత్వం బడుల్లో చేర్పించాలని డీఆర్డీఏ పీడీ యాదయ్య అన్నారు. మండలంలోని ఎనమిదితండా ప్రాథమిక పాఠశాల ను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు స ర్కార్ ఉచిత భోజనం, దుస్తులు, పాఠ్యపుస్తకాలతోపాటు మౌలి క సదుపాయలు కల్పిస్తుందన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ బాలరాజు, సర్పంచ్ పద్మజ, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూర్తితండా పాఠశాల పునర్ ప్రారంభం
మూసాపేట, జూన్ 13 : మండలంలోని సూర్తితండాలో గ తంలో ప్రాథమిక పాఠశాల మూసివేశారు. సోమవారం స్థానిక జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి ఆ పాఠశాలను పునర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొంది, అనుభవం ఉన్న ఉ పాధ్యాయులు ఉంటారన్నారు. అందుకు ప్రభుత్వ పాఠశాల ల్లోనే మెరుగైన విద్య అందుతుందన్నారు. అదేవిధంగా చక్రాపూర్‌లో బడిబాట కార్యక్రమాన్ని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ ప్రారంభించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో సర్పంచ్ లలిత, పా ఠ శాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్, ఉ పాధ్యాయులు ఉన్నారు.
సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ విద్య ఓ వరం
జడ్చర్ల, జూన్ 13 : సీఎం కేసీఆర్ పేదపిల్లలకు కూడా ఇంగ్లిష్ విద్యను అందించేందుకుగానూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి అందించడం ఓ వరంలాంటిదని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని అల్వాన్‌పల్లిలో సోమవారం ఆయన పర్యటించారు. కాలనీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అదేవిధంగా బడిబాటలో భాగంగా గ్రామంలో తిరుగుతూ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. పాఠశాలలు పునర్ ప్రారంభం కావడంతో పాఠశాలను సందర్శించారు. గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలను పాఠశాలలో చేర్పించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి, ఎంఈవో మంజూలాదేవి, ఎంపీడీవో ఉమాదేవి, డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వరి, రైతుబంధు కోఆర్డినేటర్, జంగయ్య, ఎంపీవో జగదీశ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పాండు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో…
మిడ్జిల్, జూన్ 13 : మండలంతోపాటు వేముల, మసిగుండ్లపల్లి, చిల్వేర్, బోయిన్పల్లి, వాడ్యాల్ తదితర గ్రామాల్లో సోమవారం అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు రాధికారెడ్డి, సుమతమ్మ, నారాయాణరెడ్డి, సంయుక్తరాణి, మంగమ్మ, జంగయ్య, ఎంపీటీసీ యశోద, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.