ముంబై: ముంబై(Mumbai)లో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ ఘటన .. షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గ్యాంగ్‌రేప్‌కు గురైన 20 ఏళ్ల మానసిక దివ్యాంగురాలి కేసులో అనూహ్యమైన కోణం బయటపడింది. గర్భం దాల్చిన ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న 17 మందికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ రిపోర్టులో ఆ అమ్మాయి తండ్రే పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కఫే పరేడ్ పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు.
పోలీసుల ప్రకారం.. గత ఏడాది అక్టోబర్‌లో కామా అండ్ ఆల్బ్లెస్ ఆస్పత్రి పోలీసు స్టేషన్‌కు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. 20 ఏళ్ల మానసిక దివ్యాంగురాలు తమ ఆస్పత్రిలో ఉన్నట్లు పేర్కొన్నారు. కడుపు నొప్పితో ఉన్న ఆమెను .. అయిదు నెలల ప్రెగ్నెంట్‌గా గుర్తించారు. అయితే ఆ అమ్మాయిని అనేక మంది లైంగికంగా వాడుకున్నట్లు తెలిసింది. సరైన రీతిలో మాటలు రాకపోవడంతో.. పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఆమెతో పరిచయం ఉన్న 16 మంది నుంచి డీఎన్ఏ శ్యాంపిళ్లను సేకరించారు. దాంట్లో తండ్రి, కుటుంబభ్యులు, పొరుగింటోళ్లు ఉన్నారు.
ఆ మహిళ ప్రెగ్నెన్సీని పోలీసులు టర్మినేట్ చేశారు. ఆమె గర్భస్త పిండం నుంచి డీఎన్ఏను సేకరించారు. కలినా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. జనవరి 27వ తేదీ రిపోర్టు వచ్చింది. తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏతో బాధిత వ్యక్తి పిండం నుంచి సేకరించిన డీఎన్ఏ శ్యాంపిళ్లు మ్యాచ్ అయినట్లు గుర్తించారు. ఆ నివేదిక ఆధారంగా తండ్రిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కఫే పరేడ్ మురికివాడకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కానీ ఇప్పుడు డీఎన్ఏ శ్యాంపిళ్లతో తండ్రి పాత్ర తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
భయం వల్ల బాధితురాలు తన తండ్రి పేరు చెప్పలేదని పోలీసులు తెలిపారు. అయితే ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్ సెషన్ల సమయంలో ఆమె కొన్ని విషయాలు చెప్పిందన్నారు. తండ్రి కూడా తనను లైంగికంగా వేధించినట్లు పేర్కొందన్నారు. అనేక రకాల థెరపీలు ఇచ్చి .. బాధితురాలు మాట్లాడేటట్లు చేశామన్నారు.