జడ్చర్ల, జూన్ 10 : కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. జడ్చర్లకు చెందిన కార్మిక నాయకుడు, టీయూసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు చాంద్ఖాన్కు శ్రమశక్తి అవార్డు లభించినందుకుగాను అతడి మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక చంద్రాగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాంద్ఖాన్ను శాలువా, గజమాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసే చాంద్ఖాన్కు శ్రమశక్తి అవార్డును ప్రదానం చేయడం హర్షణీయమన్నారు. కార్మికులు తప్పనిసరిగా గుర్తింపుకార్డు పొందాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు.
కార్మిక చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లాకొత్వాల్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు కాట్రపల్లి లక్ష్మయ్య, మురళి, వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రమేశ్, లత, చైతన్య, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ఇంతియాజ్‌ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ మల్లేశ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, యాదగిరి, నర్సింహులు, నయిమొద్దీన్ పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్‌యార్డు పరిశీలన
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ముందుగా మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని పలు తీర్మానాలను ఆమోదించారు. యార్డులో నూతనంగా షెడ్ నిర్మాణం, రైతు విశ్రాంతి భవనం, యార్డు చుట్టూ ఐరన్ ఫెన్సింగ్, పత్తి మార్కెట్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోతున్నదని, మార్కెట్లోని గాంధీ విగ్రహం వద్ద షెడ్ నిర్మాణానికిగానూ స్థలాన్ని పరిశీలించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, డైరెక్టర్లు సుభాష్, శ్రీకాంత్‌రెడ్డి, పవన్, కార్యదర్శి నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఉద్యానాయక్ మృతి బాధాకరం
బూర్గుపల్లి మాజీ ఎంపీటీసి ఉద్యానాయక్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యానాయక్ శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బూర్గుపల్లికి వెళ్లి ఉద్యానాయక్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అతడి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచ్ కృష్ణకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, శంకర్‌నాయక్, సలోమి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్‌చందర్ ఉన్నారు.