మాగనూర్, జూన్ 10 : గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. మండలంలోని భైరంపల్లిలో సాగుతున్న పల్లె ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలను శుక్రవారం వారు పరిశీలించారు. ముందుగా గ్రామంలోని గ్రామ దేవతకు ప్రత్యేక పూ జలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కమ్యూనిటీ హాల్, క్రీడా ప్రాంగణం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో పల్లె ప్రగతి పనులను అందరూ కలిసి చేసుకుంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హరితహారంలో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ శ్యామలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ రాణాప్రతాప్‌ను సర్పంచ్ మంజుల శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీవో జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలి
గ్రామాలు స్వచ్ఛంగా మారాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలంలోని అయ్యవారిపల్లిలో పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహిస్తున్న పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వానకాలంలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. అంతర్గతరోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించి డ్రైనేజీలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో డీఎల్పీవో సుధాకర్, ఎంపీవో రామన్న, సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలి
గ్రామాల్లో ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనని అదనపు కలెక్టర్ పద్మజారాణి అన్నారు. మండలంలోని భూత్పూర్లో పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం ఆమె గ్రామంలో పర్యటించారు. పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. గ్రామంలో విరివిగా మొక్కలను పెంచాలని, పచ్చదనంతోనే పర్యావరణాన్ని కాపాడడంతోపాటు వర్షాలు సకాలంలో కురుస్తాయన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా భావించి ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం క్రీడా ప్రాంగణం నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో పావని, సర్పంచ్ హనుమంతు, ఏపీవో గౌరీశంకర్, కో ఆప్షన్ సభ్యుడు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
ఆరోగ్య సంరక్షణకు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్ట ర్ పద్మజారాణి అన్నారు. మండలంలోని ఉందేకోడ్, నర్వ గ్రా మాలను శుక్రవారం సందర్శించారు. గ్రామాల్లో కొనసాగుతున్న క్రీడా ప్రాంగణం ఏర్పాట్లు, వర్మి కంపోస్టు షెడ్లు, నర్సరీలు, పా ర్కులను పరిశీలించారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్నారు. వర్మి కంపొస్టు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. క్రీడాప్రాంగణాల ఏర్పాట్లు, పలు అభివృద్ధి పనుల వివరాలను ఎం పీడీవో రమేశ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీవో ఉదయ్‌శంకర్, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వార్డులో అభివృద్ధి
పట్ట ణ ప్రగతితో ప్రతి వార్డులో అభివృద్ధి కొనసాగుతున్నదని మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ అ న్నారు. మక్తల్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో పట్టణ ప్రగతి ప నులు శుక్రవారం వార్డు స్పెషల్ ఆఫీసర్‌తో కలిసి కౌన్సిలర్, వార్డు కమిటీ సభ్యులు సూచించిన విధంగా కొనసాగిస్తున్నామన్నారు. 12వ వార్డులో కౌన్సిలర్ అ న్వర్ హుస్సేన్ వార్డు స్పెషల్ ఆఫీసర్ నగేశ్‌తో కలిసి ఖాళీ స్థలా ల్లో చెత్తను తొలగించారు. 1వ వార్డులో కౌన్సిలర్ శ్వేతారెడ్డి వినాయక్‌నగర్ బురాన్ గడ్డ మధ్యలో ముళ్లపొదలను జేసీబీతో తీయిస్తున్నారన్నారు. 3వ వార్డులో కౌన్సిలర్ రాములు కొత్త స్తంభాలను ఏర్పాటు చేయడం, విద్యుత్ తీగలను సరి చేయడం పనులు చేయిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 5వ వార్డులో కౌన్సిలర్ మొగిలప్ప కర్ని రోడ్డులోని ముళ్లపొదలను తొలగించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు వి ష్ణువర్ధన్రెడ్డి, రాధిక, కవిత, జాకీర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం’
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని జెడ్పీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సిద్ధి రామప్ప అన్నారు. మండలంలోని ఊట్కూర్, మొగ్దుంపూర్, ఎర్గట్‌పల్లి, వల్లంపల్లి, పగిడిమర్రి తదితర గ్రామాల్లో శుక్రవారం అధికారులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటి నీళ్లుపోశారు. రహదారుల పక్కన నాటిక మొక్కలకు ఉపాధి కూలీలు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. మండలకేంద్రంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు మురుగు కాల్వలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేందుకు ప్రతి ఒక్కరం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా ‘ప్రగతి’ పనులు
పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పట్టణంలోని 15వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్పర్సన్ శిరీష శుక్రవారం పరిశీలించా రు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కలిసి రావాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయ న్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి.