మక్తల్ టౌన్, జూన్ 10 : ఐదేండ్లు నిండిన ప్రతి విద్యార్థిని బడిలో చేర్పించాలని మక్తల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు అనిల్‌గౌడ్ అన్నారు. పట్టణంలోని ఎంపీపీఎస్ (ఎ స్సీ వాడ) పాఠశాలలో బడిబాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించి పేర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సం దర్భంగా అనిల్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధన ప్రారంభించిందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పా ఠశాలలకు పంపించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న బడిబాట
మండలకేంద్రంతోపాటు మొగల్‌మడ్క, సుద్దబండ తండాల్లో బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నది. మండల విద్యాధికారి వెంకటయ్య సుద్దబం డ తండాలో నిర్వహించిన బడిబాటలో పాల్గొని పలు సూ చనలు చేశారు. మొగల్మడ్కలో ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పిల్లలను కేంద్రాల్లో చేర్పించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చే ర్పించాలని అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులను కోరారు. మండలంలోని గుడెబల్లూర్‌లో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కేంద్రాల్లో ఆంగ్ల బోధన చేపడుతున్నట్లు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఆటపాటలుకాకుండా వి జ్ఞానాన్ని అందించేందకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పం పించాలని చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీచర్లు కమల, ఉమాదేవి, నాగేంద్ర మ్మ, అనుమంతి, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలంలో…
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చే ర్పిస్తే వారికి బంగారు భవిష్యత్తును అందజేస్తామని సీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు సునంద అన్నారు. మండ లకేంద్రంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బడి ప్రాముఖ్యతను వివరించా రు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అడ్మిషన్తోపా టు పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజ నం, రెండు జతల దుస్తులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు. క్రమంలోనే అంగన్వాడీ కేంద్రా ల్లో విద్యాభాస్యం పూర్తి చేసి అయిదేళ్లు నిండిన పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూమీడియం పాఠశాలలో…
చిన్నారులను ఉర్దూ మీడియం పాఠశాలలో చేర్పించాలని హెచ్ఎం మక్సూదాబేగం కోరారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా శుక్రవారం మండలకేంద్రంలో ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయు లు ఇంటింటికెళ్లి పిల్లలను ఉర్దూమీడియం పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రైసాబే గం, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
అంగన్వాడీ కేంద్రాలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాల ని ఎంపీవో అనురాధ అన్నారు. మండలంలోని కొత్తూర్‌లో శుక్రవారం అంగన్వాడీ బడిబాట కా ర్యక్రమాన్ని సర్పంచ్ రాధికతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వా డీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఐదేండ్లలోపు చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నట్లు తెలిపారు. రెండేండ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమం లో గ్రామ ప్రత్యేకాధికారి సాయికృష్ణ, పంచాయ తీ కార్యదర్శి లాలూ, అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో…
ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులను చేర్పించాలని సమగ్రశిక్ష సమన్వయ అధికారి బాలుయాదవ్ కోరారు. మండంలోని యన్మన్గండ్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో స ర్పంచ్ జయమ్మ, హెచ్ఎం భారతి, సీఆర్పీ జనార్దన్, నా యకులు హన్మంతు, రఘు తదితరులు పాల్గొన్నారు.