మహబూబ్‌నగర్/టౌన్, జూన్ 10 : త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ దశలవారీగా డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తుందని, ఎవరికైనా స్వంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికసాయం చేస్తామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపను చేశారు. మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం మౌలిక వసతులను కల్పించి కా ర్పొరేట్ మాదిరిగా తీర్చిదిద్దుతామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.29లక్షల 70వేలతో చేపట్టను న్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్షెడ్లు డైనింగ్ తదితర సౌకర్యాలు క ల్పించేందుకు సీఎం ఆదేశాలతో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం చేపట్టామన్నారు. మూడేండ్లలో రాష్ట్రంలో ని అన్ని పాఠశాలల్లో రూ.7,500 కోట్లతో వంద శాతం మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. నిరుపేదలను నిరంతరం సంతోషంగా ఉంచడమే లక్ష్యంగా తెలంగా ణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంద న్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీఈవో ఉషారాణి పాల్గొన్నారు.
46మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదలను నిరంతరం సంతోషంగా ఉంచడమే లక్ష్యం గా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశం లో సీఎం సహయనిధి నుంచి మంజూరైన 46మందికి రూ.36.98లక్షల విలువ చేసే చెక్కులను మంత్రి అందజేశారు. గతంలో జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకొని ప్రైవే టు దవాఖానల్లో వైద్య ఖర్చులు చేసిన రోజులకు కాలం చెల్లిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మా ర్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్ పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటాం
బడుగు, బలహీన వర్గాల రైతులకు ప్రభుత్వం అండగా ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జి ల్లా ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘాల ఉద్యోగులతో ఆ త్మీయ సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు. ఐకేపీ, మెప్మాలో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందన్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచి వారికి అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారన్నారు. గతంలో ఆర్పీలకు వీవోలకు గుర్తింపు ఉండేదికాదని, ప్రస్తుతం వారికి గుర్తింపు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు మాధవి రూప్సింగ్, జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, సునీత, అనురాధ పాల్గొన్నారు.
త్వరలోనే కొత్త పింఛన్లు
మున్సిపల్ వా ర్డు కౌన్సిలర్లు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీ రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ, డ్రైన్ పనులు ప్రా రంభించారు. వార్డులో పర్యటించి తాగునీటి, పారిశు ధ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇల్లు లేని వారందరికీ దశలవారీగా డబుల్‌బె డ్రూం ఇండ్లు ఇస్తుందన్నారు. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకొనేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. త్వరలోనే కొత్త పింఛన్లను కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు యాదమ్మ, వనజ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, మాజీ కౌన్సిలర్ శివశంకర్, 4వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లిఎల్లయ్య, శేఖర్, నాయకులు సూదనర్సింహులు, హన్మంతు, అబ్దుల్హకీం, శ్రీనివాసులు, రాములు, ఎంఈ సుబ్రమణ్య, ఏఈ హరికృష్ణ పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి డా.వీ.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం రోటరీగ్లోబల్ చాంపియన్స్ ఆధ్వర్యంలో జిల్లాలో రోటరీ క్లబ్ ఇన్స్టాలేషన్ సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ సేవలు ఉన్నాయని, మహబూబ్‌నగర్ జిల్లాలో క్లబ్ ద్వారా క్యాన్సర్‌పై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు క్యాన్సర్ బారినపడకుండా బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. మహిళలపై లైంగికదాడులు జరిగితే చట్టం లో కఠినమైన మార్పులను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు నెలరోజుల్లోనే శిక్షపడేలా చట్టాలు ఉండాలన్నారు. అంతకుముందు పీయూలో రూ.9కోట్లతో నిర్మించనున్న 2వ బాలికల వసతి గృహానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్, రిజిస్ట్రార్ పిండిపవన్కుమార్, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ ప్రభాకర్, చైర్మన్ హరిహరప్రసాద్, కార్యదర్శి రాంప్రసాద్, కౌన్సిలర్ లక్ష్మి పాల్గొన్నారు.