కొల్లాపూర్ రూరల్, జూన్ 7 : గ్రామాల్లో టీఆర్ఎస్ సర్కార్ క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తున్నది. దీంతో పల్లెల్లో ఆటలకు జవసత్వాలు ఒనగూరనున్నాయి. ప ల్లెల్లో క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో క్రీడామైదానాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి తీసుకొచ్చారు. ప్రతి పల్లెల్లో ప్రభుత్వ భూములను సేకరించి చకచకా క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నా లుగు మండలాల్లోని 93 గ్రామాల్లో క్రీడామైదానాల ఏ ర్పాటుకు 67.20 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారు లు సేకరించి పంచాయతీలకు అప్పగించారు. ఐదో విడు త పల్లె ప్రగతిలో భాగంగా పనులు చేపడుతున్నారు.
ఇ ప్పటికే కొల్లాపూర్ మండలం సింగోటం, నార్లాపూర్, కో డేరు మండలం నర్సాయిపల్లి, పెంట్లవెల్లి మండలం గో ప్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు, పెద్దకార్పాములలో క్రీడామైదానాలు దాదాపుగా పూర్తయ్యాయి. ప్ర తి గ్రామంలో క్రీడా మైదానాల పనులు చకచకా చేపడుతున్నారు. కొల్లాపూర్ మండలంలోని 16 గ్రామ పంచాయతీ పరిధిలోని 22 గ్రామాలకుగానూ 17 చోట్ల క్రీడా మైదానాల ఏర్పాటుకు 18.20 ఎకరాల ప్రభుత్వ భూమి ని అధికారులు గుర్తించారు. మిగతా ఐదు గ్రామాల్లో త్వరలోనే భూమిని సేకరించనున్నారు. కోడేరు మండలంలో 31 గ్రామాలకుగానూ అన్నిచోటల ఏర్పాటు చే సేందుకు 20.30 ఎకరాలను కేటాయించారు. పెద్దకొత్తపల్లి మండలంలో 30కుగానూ 27 గ్రామాల్లో 18.30 ఎకరాలను గుర్తించారు. పెంట్లవెల్లి మండలంలో 9 గ్రా మాలకుగానూ 9.20 ఎకరాలను సేకరించారు. పల్లెల్లో క్రీడాస్థలాలు లేకపోవడంతో విద్యార్థులు ఏండ్ల తరబడి ఆటలకు దూరమయ్యారు. క్రీడా మైదానాల ఏర్పాటుతో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు ఆటలాడుకునేందుకు ఆస్కారం ఏర్పడనున్నది. అలాగే యువకులు కూడా ఆటలకు పదును పెట్టొచ్చు. కాగా, కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని చుక్కాయిపల్లిలో, 11వ వార్డులోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానానికి ప్రహరీ నిర్మిస్తున్నారు.
విద్యార్థులకు గొప్ప వరం..
తెలంగాణ ప్రభుత్వం సదాశయంతో పల్లె లు, పట్టణాల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేయడం హర్షణీయం. ప్రతి పల్లెల్లో విద్యార్థులు నిత్యం మైదానాలకు వెళ్లి ఆటలు ఆడుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు ఆ టలపై మక్కువ చూపేలా ప్రయత్నించాలి. గ్రామాల్లో యువకులు తమ ఆటలను మెరుగుపర్చుకునే అవకాశం ఉండనున్నది. క్రీడా మైదానాలు విద్యార్థులు, యువతకు గొప్ప వరంలా మారనున్నాయి.
– హనుమానాయక్, ఆర్డీవో, కొల్లాపూర్
సద్వినియోగం చేసుకోవాలి..
నేను చదువుకునే రోజుల్లో కొల్లాపూర్లో క్రీడామైదానాలు లేక రాజాగారి బంగ్లా వద్ద ఉన్న స్థలంలో వాలీబాల్ నేర్చుకున్నా. ఎన్నో పోటీల్లో విజయం సాధించాం. జాతీయ స్థాయిలోకి వెళ్లలేకపోయాం. గ్రౌండ్ లేక ఎందరో క్రీడాకారులు చీకటిలోనే మగ్గిపోయారు. నేడు ప్రతి గ్రామంలో క్రీడామైదానం ఏర్పాటుచేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. యువకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చదువుతోపాటు ఆటల్లోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవాలి.
– శ్రీహరి, న్యాయవాది, వాలీబాల్ క్రీడాకారుడు
అన్ని కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం..
క్రీడా మైదానాల్లో వాలీబాల్, ఖోఖో, కబ డ్డీ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఓపెన్ జి మ్తోపాటు లాంగ్ జంప్, హై జంప్ నేర్చుకునేందుకు కూడా వసతులు కల్పిస్తున్నాం. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చదువుతోపాటు ఆటలకు కూడా ప్రా ముఖ్యత ఇస్తున్నారు. అందుకే క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని వినియోగించుకోవాలి.
– విజయలక్ష్మీచారి, మున్సిపల్ చైర్పర్సన్, కొల్లాపూర్