మహబూబ్‌నగర్ టౌన్, జూన్ 7: హైదరాబాద్ ఎన్ఎఫ్సీ మైదానంలో జరుగుతున్న హెచ్‌సీఏ 20-20 క్రికెట్ టోర్నీలో జిల్లా జట్టు దూసుకుపోతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అజాద్ సీసీ జట్టుపై 143పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న మహబూబ్‌నగర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. జట్టులో హర్షవర్ధన్ 59బంతుల్లో 13 ఫోర్లు 4సిక్స్లతోసెంచరీ(108) చేసి భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. శ్రీకాంత్ 34 బంతుల్లో 11 ఫోర్లు 2 సిక్స్‌లతో అర్ధసెంచరీ(74) చేసి నాటౌట్‌గా నిలువగా, అబ్దుల్ఫ్రీ 19, షాదాబ్ 7పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అజాద్ సీసీ జట్టు 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓటమిపాలైంది. బౌలర్లలో అనిల్‌కుమార్, షాదాబ్ చెరో రెండు వికెట్లు, మహ్మద్జూబేర్, పవన్‌కుమార్, డేవిడ్క్రిపాల్ ఒక్కో వికెట్ తీసి జిల్లా జట్టు విజయానికి కృషి చేశారు. ఈమేరకు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాజశేఖర్, కోచ్ అబ్దుల్లా జట్టు క్రీడాకారులను అభినందించారు.