మాగనూర్, జూన్ 7 : తొలకరి వర్షాలకు వచ్చే పచ్చిక ను తిని జీవాలు వివిధ రోగాల బారినపడి మృత్యువాత ప డకుండా ప్రభుత్వం ముందస్తుగా పశుసంవర్ధక శాఖను అ ప్రమత్తం చేసింది. అందులో భాగంగానే బుధవారం నుం చి 16వ తేదీ వరకు గొర్రెలు, మేకలకు గ్రామాల్లో ప్రత్యేక సంచార వైద్య బృందాలు వెళ్లి గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాపనున్నారు. అందుకు సంబంధిం చి ఆయా గ్రామాల్లోని కాపరులకు స్థానిక పశువైద్య సిబ్బం ది ముందస్తుగా సమాచారమిస్తారు. గ్రామాల వారీగా రూ ట్ మ్యాప్‌ను మండల పశువైద్య అధికారులు రూ పొందించారు. అయితే పశువైద్య సిబ్బంది బృందాలుగా గొర్రెల మందకు వెళ్లి నట్టల నివారణ మందును తాపుతారు. కాపరులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పశువైద్యశాఖ డాక్టర్ స్వామి నాయక్ సూచించారు.
జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు
గొర్రెలు, మేకల పెంపకందారులు జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చు. గొర్రెలు, మేకల పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వాటికి పాలు, ఆహా రం అందకపోవడంతో రోగాల బారినపడే ప్రమాదం ఉం టుంది. ఇటీవల ప్రభుత్వం గొల్ల కురుమల అభివృద్ధికి స బ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసింది. అంతే కాకుండా వాటి బాగోగులు చూసుకునేందుకు మంద వద్దకే వైద్య సేవలు అందించేందుకు సంచార వైద్యం పథకాన్ని అమలు చేస్తున్నది. సీజనల్ వ్యాధులు వ్యాపించకముందే గ్రామగ్రామా నా వైద్య శిబిరాలు నిర్వహించి జీవాలకు వైద్యం అందించనున్నారు. కానీ గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తే మంచి లాభాలు పొం దవచ్చని పశువైద్యాధికారులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పుట్టిన వెంటనే పిల్లల ముక్కురంధ్రాలకు అంటిఉండే పొర, స్రవాలను శుభ్రమైన పొడి దుస్తువుతో తుడిచి గాలి పీల్చే లా చేయాలి. లేనిచో స్రవాలతోపాటు దుమ్ము, దూళి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లి వ్యాధి బారినపడుతున్నది. పిల్లలు పు ట్టగా నే శరీరం నుంచి రెండు మూడు అంగులాలు వదిలి బొడ్డు కట్టి శుద్ధిచేసిన కత్తెరతో మిగతా భాగాన్ని కత్తిరించా లి. వెంటనే పించర్ అయోడిన్ అద్దాలి. నాలుగైదు రోజులపాటు అయోడిన పూసి బొడ్డు ద్వారా శరీరంలోకి సూక్ష్మక్రిములు ప్రవేశకుండా చర్యలు తీసుకోవాలి. తల్లి పొదుగు ఒ క శాతం పొటాషియం పర్మాంగనెట్తో కడిగి శుభ్రమైన దు స్తువుతో తుడిచి పిల్లలు పుట్టిన గంటలోనే తల్లి పాలు తాగించాలి. పుట్టిన పిల్లలను తల్లులతోపాటు గొర్రెల పాకలో వదలవద్దు. అలా చేస్తే పాకలోని పేడ, మూత్రం వంటివి అం టుకొని హానికరమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అం దు వల్ల ఒకటి రెండు రోజులు తల్లులతో ఉంచి ఆ తర్వాత ప్రత్యేక పాకలో ఉంచాలి. మూడు నెలల వయస్సు రాగానే పిల్లలకు తల్లిపాలు మాన్పించాలి.
అలా చేస్తే తల్లులు త్వ రగా ఎదకొస్తాయి. పిల్లలు మూడు, నాలుగు వారాలు దా టాకా గడ్డిరకాడం, నీరు తాగడం ప్రారంభిస్తాయి. మొదట సన్నటి, మెత్తటి గడ్డి, లేదా సన్నటి ఆకుల చెట్ల కొమ్మలు తి నడానికి పెడితే ఆలవాటుపడతాయి. పిల్లల పాకలో అక్కడక్కడ లవణ మిశ్రమ ఇటుకలు వేలాడదీస్తే పిల్లలు వాటిని నాకుతాయి. దాని వల్ల వాటిలో కాలుష్యం, భాస్వరం, ఇ నుము మొదలైన ఖనిజ లవణాల లోపాలు రాకుండా నివారించబడతాయి. అంతర్ పరాన్న జీవుల్ని నివారించడానికి పిల్లలు పుట్టిన పది రోజుల తర్వాత మూడు నెలల వయ స్సు ఉన్నప్పుడు మందులు తాగించాలి. పిల్లల మెడకు లే దా చెవులకు గుర్తింపు నెంబర్లు వేసి పెరుగుదల పరిశీలించాలి. నలుగు నెలల వయస్సులోనే వ్యాధి నిరోధిక టీకాలు వేయించాలి.
ప్రతి గ్రామంలో నట్టల నివారణ మందు పంపిణీ
గొర్రెలు, మేకలకు బుధవారం నుంచి 16వ తేదీ వరకు మండల పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తాం. 8న మందిపిల్లి, కొల్పుర్, 9న అమ్మపల్లి, వడ్వట్, 10న మాగనూర్, పెగడబండ, 11న కొత్తపల్లి, గురురావు లింగంపల్లి, 13న వర్కూర్, 14న నేరడగం, 15న ఉజ్జల్లి భైరంపల్లి 16న ఓబ్లపూర్ పూంజనూర్ గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేయడం జరుగుతున్నది. మండలంలోని అన్ని గ్రామాల గొర్రెలు, మేకలకు పెంపకందారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవాలు రోగాల బారిన పడకుండా కాపాడుకోవాలి.
– వినయ్, వెటర్నరీ అసిస్టెంట్