మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 7: పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఐదో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ఆయా వార్డులో కౌన్సిలర్లు, అధికారులు, వార్డు కమిటీ సభ్యులు సమస్యలను గుర్తించి ఖాళీస్థలాల్లో పేరుకపోయిన చెత్త, మురుగుకాల్వల్లో మంగళవారం పూడిక తొలగింపు చేపట్టారు. పట్టణంలోని 7, 22, 37, 39వ వార్డులో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటిగణేశ్ పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు. ఆయా వార్డులో కౌన్సిలర్లు ఆనంద్‌గౌడ్, పటేల్ ప్రవీణ్, కట్టా రవికిషన్‌రెడ్డి, కోరమోని వనజ, నీరజ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రాంకాలనీలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ పారిశుధ్య పనులను పరిశీలించారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, జూన్ 7: మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పట్టణంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి 2వ వార్డులో పర్యటించారు. కౌన్సిలర్ బుక్క మహేశ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో కంపచెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు. 14వ వార్డులో కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. అదేవిధంగా 24వ వార్డులో కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షణలో పట్టణప్రగతి పనులను చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ మహమూద్‌షేక్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రమేశ్, ప్రమీల, శ్రీలత, టీఆర్ఎస్ నాయకులు మాలిక్‌షాకీర్, వెంకటేశ్, సంతోశ్‌నాయక్, పార్శి వెంకటేశ్, శాంతయ్య, సత్యం, అంగన్వాడీ, ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పారిశుధ్యం లోపించొద్దు
భూత్పూర్, జూన్ 7: మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం లోపించొద్దని ఎంపీడీవో మున్ని కోరారు. మండలంలోని అన్నాసాగర్‌లో మంగళవారం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అధికారులు పర్యటించి తాగునీటి పరఫరా, సీసీరోడ్లను, డ్రైనేజీలను పరిశీలించారు. ఇండ్ల మధ్యన మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సాయిబాబా, ఎంపీవో విజయకుమార్, సర్పంచ్ నీలిమ, ఎంపీటీసీ రజిత, ఉపసర్పంచ్ రాజారెడ్డి పాల్గొన్నారు.
రోడ్ల సుందరీకరణపై శ్రద్ధ పెట్టాలి
రాజాపూర్ జూన్ 7: రహదారి సుందరీకరణపై ప్రత్యేక శ్రధ్ధతీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలకేంద్రంలో పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలను పూలమొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మండలంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులపై అరా తీశారు. ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.