ఊట్కూర్, జూన్ 7 : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన బోధ న జరుగుతుందని మల్లేపల్లి సర్పంచ్ మాణిక్యమ్మ, ప్రధానోపాధ్యాయుడు నర్సింగప్ప, సునంద అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఊట్కూర్, మల్లేపల్లి గ్రామాల్లో మంగళవారం అంగన్వాడీ చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాల న్నారు. ఊట్కూర్ 1వ అంగన్వాడీ కేంద్రం నుంచి 12 మంది పిల్లలను సీపీఎస్‌లో చేర్పించారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదిత రులు పాల్గొన్నారు.
పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
దామరగిద్ద, జూన్ 7 : విద్యార్థులను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించాలని మండల విద్యాధికారి వెంకటయ్య అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగం గా మండలంలోని వత్తుగుండ్ల, కంసాన్పల్లి గ్రామాల పాఠశాలలను ఎంఈవో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విద్యార్థుల ను చేర్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం నా ణ్యమైన విద్యాబోధన అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్‌లో…
ధన్వాడ, జూన్ 7 : మండలంలోని కొండాపూర్‌లో మంగళవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విమల మాట్లాడుతూ బడిబయట పిల్లలను బడికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బడిబయట పిల్లలను గుర్తించారు. కార్యక్రమం లో పాఠశాల హెచ్ఎం భారతి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న బడిబాట
నారాయణపేట రూరల్, జూన్ 7 : మండలంలోని సింగా రం, శాసన్‌పల్లి, అప్పిరెడ్డిపల్లి, జాజాపూర్ తదితర గ్రామాల్లో మంగళవారం బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నది. శాసన్‌పల్లిలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. సింగారంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత వివరించారు. కా ర్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విదార్థులు తదితరులు పాల్గొన్నారు.