దేవరకద్రరూరల్, జూన్ 7: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నారు. మండలంలోని ఇస్రంపల్లిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకారంతో మంగళవారం గ్రామంలోని విద్యార్థులకు 30సైకిళ్లను పంపిణీ చేశారు. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రంపల్లి నుంచి కౌకుంట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్తారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గ్రామం నుంచి వెళ్తుండగా నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులతో మాట్లాడి సైకిళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలలు తెరువక ముందే 8,9,10, ఇంటర్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు స్కూటీలు
మండలంలోని దేవరకద్ర, పెద్దగోప్లాపూర్, నార్లోనికుంట గ్రామాలకు చెందిన ముగ్గురు దివ్యాంగులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సహకాంతో స్కూటీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్ కర్ణం రాజు, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు, సర్పంచులు స్వామి, శ్రీనివాసులు, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
కప్పెటలో 12మంది విద్యార్థులకు..
భూత్పూర్, జూన్ 7: మండలంలోని కప్పెటలో 12మంది విద్యార్థులకు ఎమ్మెల్యే ఆల సహకారంతో సైకిళ్లు పంపిణీ చేశారు. కొన్నిరోజుల కిందట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కప్పెట పర్యటనలో భాగంగా విద్యార్థినులు పాఠశాలకు దాదాపు 5కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లడంతో ఎమ్మె ల్యే కారు ఆపి విద్యార్థులతో మాట్లాడారు. త్వరలోనే సైకిళ్ల ను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు మూసాపేటలోని కోజెంట్ కంపెనీ సహకారంతో మంగళవారం 12మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, వైస్‌ఎంపీపీ నరేశ్‌గౌడ్, సర్పంచ్ వేణుగోపాలాచారి, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, ఎస్ఎంసీ చైర్మన్ కుర్మయ్య, యూత్ అధ్యక్షుడు సాయికుమార్ పాల్గొన్నారు.