మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 5 : అన్నివర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. మీర్ మహబూబ్ అలీఖాన్ ఫౌండేషన్ వ్యవస్థకుడు అబ్దుల్హ్రీం ఆధ్వర్యంలో ఆదివా రం స్థానిక టీడీగుట్టలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఇంతియాజ్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 12 మైనార్టీ గురుకులాలు ఉండగా, తెలంగాణ వచ్చాక 204 గురుకులాలను ఏర్పా టు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేదల సంక్షేమానికి దేశం లో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ అభివృద్ధికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
పాత కలెక్టరేట్ స్థానంలో రూ.400కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలో మీర్ మహబూబ్‌నగర్ అలీఖాన్ స్మారక భవనం ఏర్పాటు చేయాలని వివిధ సంఘా ల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సామాజికవేత్తలు పాండురంగారెడ్డి, నయ్యార్, నాయకులు అబ్దుల్‌హాది, హనీఫ్ అహ్మద్, సమాద్ఖాన్, షేక్ ఫారూఖ్‌హుస్సేన్, ఖలీల్, ఇష్రత్అలీ, యూసుబ్ బిన్ నాసర్, వహిద్షా, బషీర్ అహ్మద్, ర హెమాన్, సాదుతుల్లాహుస్సేనీ ఉన్నారు.