ఊట్కూర్, జూన్ 5 : జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లుల ను ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింద ని జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప అన్నారు. స్థానిక మండల పరిషత్ కా ర్యాలయంలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రా మ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు ఉన్నట్లు ఓ దిన పత్రికలో ప్రచురితమైన వార్తా కథనాన్ని ఆయన ఖండించారు. మండలంలోని అన్ని గ్రా మ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఏప్రిల్, మే నెల పెండింగ్ బిల్లులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే జిల్లా వ్యాప్తంగా ఏప్రి ల్ నెలలో రూ.4.79 కోట్లు, మే నెలలో గ్రాంట్ రూ.4.79 కోట్ల నిధులు పంచాయతీలకు విడుదల చేశామన్నారు. జిల్లాలో ఏ గ్రామ పంచాయతీకి కూడా పెండింగ్ బిల్లులు లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎం పీడీవో కాళప్ప పాల్గొన్నారు.