మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 5 : కరాటేలో విద్యార్థులు రాణించాలని ఫుట్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్, గ్రాండ్ మాస్టర్ మహ్మద్ జాఫర్ఖాద్రీ సూచించారు. సూపర్ బుడోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మోడల్ బేసిక్ హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన వేసవి శిక్షణాశిబిరం ముగింపు కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలబాలికలు తప్పనిసరిగా కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ బుడోకాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో వేసవిలో ఉచితంగా యోగా, కరాటే శిక్షణ ఇవ్వడంపై మాస్టర్ వెంకటేశ్‌ను అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఊర్మిళ, సూపర్ బుడోకాన్ కరాటే క్లబ్ సీనియర్ మాస్టర్ రవికుమార్, వివిధ సంఘాల ప్రతినిధులు ముత్యం, బాలరాజు, సంజీవ్ ముదిరాజ్, నర్సింహులు, మహ్మద్ జహేద్ అజార్, రాంచంద్రయ్య, ఎంఏ రషీద్, బాలకిష్టయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.