మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 5 : ఆరోగ్య సం రక్షణకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రా వు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీడీగుట్టలో ఆదివారం పట్టణప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డుల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దోమల నివారణకు సెప్టిక్‌ట్యాంకు పైపులకు దోమతెరలను ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
రాజాపూర్, జూన్ 5 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మండలకేంద్రంతోపాటు కుచ్చర్కల్ గ్రామాల్లో నర్సరీలు, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 5 : మండలంలోని పెద్దాయపల్లిలో అదనపు కలెక్టర్ సీతారామారావు పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఇండ్ల మధ్య పారిశుధ్యం లోపించకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అం తకుముందు క్రీడాప్రాంగణం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కృష్ణారావు, గ్రామ ప్రత్యేకాధికారి ప్రశాంత్‌రెడ్డి, సర్పంచ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మహబూబ్‌నగర్ రూరల్, జూన్ 5 : మండలంలోని మాచన్‌పల్లి తండాలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ప్రణాళికాబద్ధంగా పల్లెప్రగతి పనులను చేపట్టి తండాను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో మం డల ప్రత్యేకాధికారి యాదయ్య, ఎంపీడీవో వేదవతి, సర్పంచ్ శ్రీనునాయక్, పంచాయతీ కార్యదర్శి సరోజ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్లటౌన్, జూన్ 5 : మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పట్టణప్రగతి పనులను విస్తృతంగా చేపట్టారు. 14వ వార్డులో కౌన్సిలర్ కోనేటి పుష్పలత ఆధ్వర్యంలో రోడ్లు, మురుగుకాల్వలను శు భ్రం చేశారు. 25వ వార్డులో కౌన్సిలర్ లత ఆధ్వర్యంలో మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. అలాగే ఖాళీస్థలాల్లో కంపచెట్ల తొలగింపు పనుల ను చేపట్టారు. 23వ వార్డులో కౌన్సిలర్ ఉమాశంకర్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టణప్రగతి పనులు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరిగి కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జూన్ 5 : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు మురుగుకాల్వలను శుభ్రం చేయించడంతోపాటు కంపచెట్ల తొలగింపు పనులను చేపట్టా రు. అలాగే హరితహారంలో మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించారు. లింగంపేటలో స ర్పంచ్ హైమావతీవెంకట్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి సమస్యలపై చర్చించారు. కార్యక్రమాలలో సర్పంచులు సుకన్య, మమతానవీన్రెడ్డి, మోహన్‌నాయక్, శ్రీనివాసులు, డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వరి, పీఆర్ ఏఈ జవహర్బా బు, ప్రత్యేకాధికారులు గోపీనాథ్, ఆర్ఐ రాఘవేంద్ర, ఏఈవోలు రమేశ్‌రెడ్డి, నవనీత, నర్సింహు లు, గౌస్‌పాషా పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, జూన్ 5 : మండలంలోని అన్నారెడ్డిపల్లి, కాంచనపల్లి, మంగంపేటతండా, వెన్నాచేడ్ గ్రామాల్లో డీఆర్డీవో యాదయ్య పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అన్ని గ్రామాల్లో ప్రజాసమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏపీడీ శారద పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జూన్ 5 : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్‌కుమార్, తాసిల్దార్ శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, సర్పంచు లు సత్యమ్మ, వసంత, చెన్నయ్య, రేవతి, చెన్న మ్మ, శ్రీదేవి, సరస్వతి, మానస పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు
భూత్పూర్, జూన్ 5 : గ్రామాల్లో నెలకొన్న స మస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మండల ప్రత్యేకాధికారి సాయిబాబా తెలిపారు. మండలంలోని లంబడికుంట గ్రామపంచాయతిలో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అనంతరం గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మున్ని, తాసిల్దార్ చెన్నకిష్టన్న, సర్పంచ్ కమలమ్మ, ఎంపీటీసీ రమణి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ సహకరించాలి
కోయిలకొండ, జూన్ 5 : పల్లెప్రగతి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మండల ప్రత్యేకాధికారి మధుసూదన్‌రావు కోరారు. మండలంలోని తిర్మలాపూర్, ఆచార్యాపూర్ గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆచార్యాపూర్లో గ్రామస్తులు శ్రమదానం నిర్వహించారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో జయరాం, సర్పంచ్ రాము, ఏపీవో నసీర్‌అహ్మద్ పాల్గొన్నారు.