హన్వాడ, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలకేంద్రంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో జలకాలుష్యం ఏర్పడి పర్యావరణం దెబ్బతింటుందన్నా రు. ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అం దరిపై ఉందన్నారు. కాలుష్య నివారణకు ప్లాస్టిక్ నిషేధం పాటించాలని సూచించారు. అలాగే ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలను నాటి పెంచాలని కోరారు. అనంతరం గ్రామంలో పర్యటించి పల్లెప్రగతి పనులతోపాటు మార్కెట్‌యార్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీ నివాసులు, సర్పంచ్ రేవతి, ఈవోపీఆర్డీ వెంకట్‌రెడ్డి, ఏపీఎం సుదర్శన్, ఏవో కిరణ్‌కుమార్, సీసీ లు బాలరాజు, జయమ్మ పాల్గొన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి
మహబూబ్‌నగర్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణపై ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు పెద్దఎత్తున మొక్కలను నాటి పెంచాలని, ప్లాస్టిక్ నిషే ధం పాటించాలని సూచించారు. అనంతరం ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీపీఆర్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకంతో ముప్పు
జడ్చర్ల, జూన్ 5 : ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. జడ్చర్ల మండలంలోని మాచారంలో ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అలాగే మర్రిచెట్టుతండాలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో జగదీశ్, గ్రామ ప్రత్యేకాధికారి గౌస్‌పాషా, ఉపసర్పంచ్ రవి, తిరుపతిరెడ్డి, శ్రీశైలం, బాల్నాగయ్య, శివ, తిరుపతయ్య పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ నిషేధాన్ని పాటించాలని సర్పంచ్ గోపీనాయక్ అన్నారు. మండలంలోని వాయిల్కుంటతండాలో మొక్కలు నాటారు. అ నంతరం పర్యావరణ పరిరక్షణపై తండావాసుల తో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాసురాథోడ్ పాల్గొన్నారు.
ప్రకృతిని కాపాడుకోవాలి
మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 5 : ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రమేశ్‌కుమార్, బాలరాజు, ఉమాదేవి పాల్గొన్నారు. అదేవిధంగా పోగ్రెసివ్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పాల్సాబ్గుట్టలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, రవికిరణ్, గోపాలకృష్ణ, సతీశ్‌కుమార్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
జనపనార సంచులు పంపిణీ
జడ్చర్లటౌన్, జూన్ 5 : పట్టణంలోని 24వ వా ర్డులో కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు జనపనార సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి జనపనార సంచులను వినియోగించాలని కోరా రు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రమేశ్, ప్రమీల, శ్రీలత, గోనెల రాధాకృష్ణ పాల్గొన్నారు.