మక్తల్ టౌన్, జూన్ 5 : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అ న్నారు. మున్సిపాలిటీలోని తొమ్మిదవ వార్డు ఎల్లమ్మకుంటలో పట్టణ ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వార్డు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మా ట్లాడుతూ వార్డులో డ్రైనేజీ, రోడ్డు వంటి సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డులో రాంలీలా మైదానం పక్కన గల వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఇండ్ల పక్కన ఉండడంతో తీసి మరోచోట ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
వార్డులో సమస్యలు అధికంగా ఉన్నాయని, ప్రస్తుతం పట్టణ ప్రగతిలో భాగంగా చెత్త కు ప్పలు, డ్రైనేజీ నీరు నిలిచిపోయిన చోట, ముళ్ల పొదలు, విద్యుత్ తీగలు వంగి ఉండడం వంటి సమస్యలను వార్డు కమిటీ సభ్యులు, వార్డు స్పెషల్ అధికారులకు తెలియజేసి పనులు త్వరగా చేయాలన్నారు. ఎల్లమ్మకుంటకు సీఎస్సీ నిధుల నుంచి రూ.65లక్షలతో డ్రైనేజీ సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, కౌన్సిల ర్ రాధిక, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు మల్లికార్జున్, లలిత, శివారెడ్డి, నారాయణ, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.