దేవరకద్ర, కోస్గిలో ఐటీ, పురపాలక మంత్రి కలకుంట్ల తారకరామారావు కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు.. భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ వద్ద, కోస్గి పట్టణంలో భారీ బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఘాటుగా స్పందించారు.. అమిత్ షా తన తప్పును నిజాయితీగా ఒప్పుకొని ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు.. ఇన్నాళ్లు మేమేమీ చేయలేదని, పచ్చి దగాకోర్లమని కేంద్ర మంత్రి అంగీకరించి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడన్నారు.. తెల్లారి లేస్తే కులం, మతం పేరిట చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు.. 50 ఏండ్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయని వారు మళ్లీ వచ్చి మాకు అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ నాయకులు అడగడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు..
– నెట్వర్క్, జూన్ 4 (నమస్తే తెలంగాణ)
భూత్పూర్, జూన్ 4 : మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరం గ సభలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాదాపు 500 మంది టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్ర సర్కార్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్ 4వ వార్డు కౌన్సిలర్ గ డ్డం నాగమ్మ, మదనాపురం మండలం కొన్నూ రు ఎంపీటీసీ శరత్‌రెడ్డి, కొన్నూరు సర్పంచ్ జగన్, ఉపసర్పంచ్ రఘుపతిరెడ్డి, ద్వారకానగర్ సర్పంచ్ అనిత, సీపీఎం జ నరల్ సెక్రటరీ భాస్కర్, చిన్నచింతకుంట మండలం ఉం ద్యాల ఎంపీటీసీ నె ల్సన్, అ ప్పంపల్లి ఎంపీటీసీ మనోహర్‌రెడ్డి, భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఆల శ్రీకాంత్‌రెడ్డితోపాటు 500 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.