మక్తల్ టౌన్, జూన్ 4: మక్తల్ మున్సిపాలిటీలోని వార్డు కమిటీ సభ్యులు సూచించిన సమస్యలను త్వరగా అధికారులు పరిష్కరించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సూచించారు. శనివారం మక్తల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ పావని, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ అఖిల ఆధ్వర్యంలో స్పెషల్ ఆపీసర్లు ఆయా వార్డుల కౌ న్సిలర్లు, మున్సిపల్ అధికారులు, వార్డు సభ్యులతో కలిసి 1,2,3,4,10,14వ వార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజ లు ఎమ్మెల్యేకు వివరించారు. ఆయా వార్డుల్లో కమిటీ స భ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే చిట్టెం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు.కాలనీలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను డబ్బాలలో నిలువ ఉంచుకొని మున్సిపాలిటీ చెత్త వాహనంలో వేయాలని తెలిపారు. రెండో వార్డులో ఇండ్లమధ్య ఉన్న దేశబావిని పూడ్చాలని, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తూ నీరు నిలువకుండా చూ డాలన్నారు.సమస్యలు ఉంటే ఆయా వార్డు స్పెషల్ ఆఫీసర్లకు తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ నర్సింహ, కౌన్సిలర్లు లక్ష్మి, శ్వేత, విష్ణు, జగ్గలి రాములు, చీరాల సత్యనారాయణ,గొల్లపల్లి శంకరమ్మ నారాయణ, ఏఈ నాగశివ, సూర్యప్రకాశ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.