మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 3 : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన విద్య అందిస్తున్నట్లు డీఈవో ఉషారాణి అన్నారు. కొనపాలమూరులో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమాలతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 10వ తేదీవరకు నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయు లు విధిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 98మందిని పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎంఈవో జయశ్రీ పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించి మెరుగైన విద్య అందిస్తున్నట్లు ఎంఈవో మంజులాదేవి అన్నారు. మున్సిపాలిటీలోని త్రిశూల్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధ్యాయులు బడిబా ట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం లో ఏఎంవో వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
మండలంలోని కోడూర్లో బడిబాట కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, హెచ్ఎంలు రావిపాల్, రమేశ్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం ప్రా రంభమైంది. ఇప్పటూర్‌లో ఏర్పాటు చేసిన కా ర్యక్రమానికి డిప్యూటీ తాసిల్దార్ హాజరై మాట్లాడారు. బడిబయటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌసియాబేగం, ఎంపీటీసీ లక్ష్మీబాయి, ఉపసర్పంచ్ రవికిరణ్, హెచ్ఎం నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి కల్పన, నా యకులు అబ్దుల్లా, నవనీతరావు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండలంలోని వస్పుల్లో హెచ్ఎం ఇందిరారాణి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులతో కలిసి ఇంటింటికెళ్లి చదువు ప్రాముఖ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే ర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, గౌతమి పాల్గొన్నారు.