జడ్చర్ల, జూన్ 3: గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతోపాటు శుభ్రంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పోలేపల్లిలో శుక్రవారం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు పల్లెప్రగతిపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయడం వల్ల గ్రామంలోని సమస్యలు తెలుస్తున్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్‌షెడ్లు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15రోజులపాటు నిర్వహించే పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ పాల్గొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సమస్య వివరించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రామంలో రైతువేదిక భవనాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జ్యోతి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచ్ చేతనరాంచంద్రారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, వైస్‌చైర్మన్ సుధాకర్‌రెడ్డి, రైతుసంఘం నాయకుడు జంగయ్య, ఎంపీడీవో ఉమాదేవి, ఎంఈవో మంజూలాదేవి, ఎంపీవో జగదీష్, సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, అరుణ, మాజీ సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, బాలస్వామిగౌడ్, జంగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కోఆర్డినేటర్ రాంచంద్రారెడ్డి, నాగిరెడ్డి, తిరుపతిరెడ్డి, విజయ్, రాఘవేందర్‌గౌడ్, టీఏ వేణుగోపాల్, కృష్ణయ్య, కార్యదర్శి శివప్రసాద్, ఏవో గోపినాథ్, ఏఈవోలు పాల్గొన్నారు.