మహబూబ్‌నగర్, జూన్ 3 : పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు (ప్రేమ్‌నగర్)లో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ నాల్గో విడుత పట్టణ ప్రగతిని మరింత పక్కాగా ముందుకు తీసుకెళ్లామన్నారు. తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో రూ.300 కోట్లతో రహదారులు, మురుగు కాలువలు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.100 కోట్లతో పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపా రు. రూ.200 కోట్లతో ప్రధాన రహదారిని అభివృద్ధి చేశామన్నారు. అప్పన్నపల్లి వద్ద మరో రెండు నెలలో రెండో బ్రిడ్జిని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వార్డు మ హిళలు కట్టుమిషన్ కేంద్రం కావాలని కోరారని, వారం రోజుల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కుట్టుమిషన్లు, ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం ఏర్పాటుతోపాటు మిషన్లు ఉచితంగా అందిస్తామన్నారు. అనంతరం కాలనీలో పర్యటించారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఇంటింటికీ తిరిగి సమస్యలను గుర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవార్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు కిశోర్, బాలేశ్వరి, రాజేశ్వరమ్మ, ట్రాన్స్‌కో ఎస్ఈ మూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఇంజినీర్ సుబ్రహ్మణ్యం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కిరణ్మయికి అభినందన..
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కే.కిరణ్మయి ఆలిండియా సివిల్స్ సర్వీసెస్‌లో 56వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర క్యాడర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వి షయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కిరణ్మయిని అభినందించారు. కార్యక్రమంలో కిరణ్మయి కుటుంబసభ్యులు ప్రతాప్‌నాయక్, సీటీవో విజయ్, గోపాల్‌నాయక్, పూనమ్, మహేందర్, శంకుతల ఉన్నారు.