మక్తల్‌రూరల్, జూన్ 3: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గ్రామీణ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మక్తల్ మండలంలోని కాట్రేవ్‌పల్లి గ్రామంలో క్రీడాప్రాంగణాన్ని జెడ్పీ చైర్ పర్సన్ వనజాగౌడ్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో క్రీడలపై అంతగా ప్రాధాన్యత లేదని, ఇటీవల క్రీడలకు, క్రీడాకారులకు సమాజంలో మరింత గౌరవం పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో క్రీడలకు సరైన సదుపాయాలు లేకపోవడంతో పట్టణాలకు వచ్చి మైదానాల్లో ఆటలు ఆడుకునే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడానికి ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈమేరకు మక్తల్ నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన క్రీడా ప్రాంగణాలను నిర్మించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం కాట్రేవ్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే , జెడ్పీ చైర్పర్సన్ మొక్కలను నాటి నీళ్లుపోశారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో పావని, ఏపీవో గౌరీశంకర్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సజాత, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మునిస్వామి,
దేశానికే ఆదర్శం తెలంగాణ
అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అథితులుగా హాజరై తడి, పొడి చెత్త సేకరణ వాహనాన్ని రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ప్రతి పల్లెనూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పదిహేను రోజుల పాటు జరిగే పల్లెప్రగతిలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈవో సిద్దిరామప్ప, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణరెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, ఉప సర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, పంచాయతీ కార్యదర్శి సుమలత, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
గ్రామాల ప్రగతితోనే రాష్ట్రం అభివృద్ధి
మాగనూర్ జూన్ 3: మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేసి భూముల రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించి ధరణి రిజిస్ట్రేషన్లపై తాసిల్దార్ తిరుపతిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మండలంలో పర్యటించి 5వ విడుత పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కొత్తపల్లి గ్రామంలో 150 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా క్రీడాప్రాంగణం, బృహత్ ప్రకృతివనం ఎందుకు ఏర్పాట్లు చేయలేదని స్పెషల్ ఆఫీసర్ ఎంపీవో జైపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. గ్రామానికి, తాళంకేరి గ్రామానికి చెందిన కొందరు రైతులు కబ్జాలో ఉన్నారని ఎంపీవో సమాధానం ఇచ్చారు. రైతుల నుంచి కొంతభూమి తీసుకొని గ్రామీణ క్రీడామైదానం బృహత్ ప్రకృతివనం పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని తాళంకేరి, గురురావులింగంపల్లి, వర్కూ ర్ గ్రామంలో పర్యటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు.అభివృద్ధి పనులు చకచకా పూర్తిచేయాలని స్పెషల్ ఆఫీసర్లకు, సర్పంచులకు సూచించారు. పల్లెప్రగతి విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.