మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 1 : మృతదేహాల ద హన సంస్కారాల కోసం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఎల్పీజీ శ్మశాన వాటికను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ సమీపంలో ఉన్న మౌలాలి గుట్ట సమీపంలో డంపింగ్ యార్డు స్థలంలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఎల్పీజీ డబుల్ బర్న్ ప్లాంట్‌ను బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట, సిద్ధిపేట, గజ్వేల్ మున్సిపాలిటీల్లో నెలకొల్పిన మాదిరిగానే మహబూబ్‌నగర్‌లో కూడా ఏర్పాటు చేశామన్నారు. దహన సంస్కారాల సమయంలో కలప వినియోగానికి ప్రత్యామ్నాయంగా ఎల్పీజీ పనిచేస్తుందని తెలిపారు.
ఆటోమేటిక్ కట్ ఆఫ్ గ్యాస్ సెన్సార్ విధానంలో 4 కిలోల బర్నర్ గంటలకు 4 కిలోల ఎల్పీజీని మండిస్తుందని చెప్పారు. మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వివరించారు. ఇప్పటికే ప్రధాన రోడ్డు విస్తరణతోపాటు చౌరస్తాలను సుందరంగా తీర్చిదిద్దునట్లు పే ర్కొన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కా వాలని పిలుపునిచ్చారు. మౌలాలి గుట్ట వద్ద నిర్మాణం లో ఉన్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను మం త్రి పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహు లు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు రామాంజనేయులు, కిశోర్, నాయకులు హన్మంతు, తిరుమల వెంకటేశ్ పాల్గొన్నారు.
అత్యాధునిక మార్కెట్ ఏర్పాటు
మహబూబ్‌నగర్, జూన్ 1 : అత్యాధునిక సౌకర్యాలతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేం ద్రంలోని టీడీ గుట్ట వద్ద రూ.3.6 కోట్లతో నిర్మించనున్న మార్కెట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నిర్మా ణ పనులకు సంబంధించి జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్అండ్బీ అధికారి సంధ్యకు పలు సూచనలు అందించారు. అనంతరం జిల్లా అధికారుల తో కలిసి రైతుబజార్ ప్రాంతాన్ని పరిశీలించి రైతులతో ముచ్చటించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చేసేదంత రైతుల సం క్షేమం కోసమేనని ఆయనన్నారు. ఇప్పటికే మినీ ట్యాం క్ బండ్ వద్ద మోడల్ రైతుబజార్‌ను నిర్మించామని, మెట్టుగడ్డ వద్ద పనులు చకచకా జరుగుతున్నాయని చెప్పారు.
ఆర్అండ్బీ వద్ద మోడల్ మార్కెట్లను ఏ ర్పాటు చేస్తామన్నారు. దీంతో రైతులకు, కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మోడల్ రైతుబజార్ నిర్మాణ పనులకు రైతులు పూర్తిస్థాయి సహకారం అందించాలని కోరారు. అంద రం సమిష్టిగా ఉంటూ మహబూబ్‌నగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకుందామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ చైర్మన్ రహెమాన్, కౌన్సిలర్లు కిశోర్, రాము, యా దవ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, ఆర్అండ్బీ అధికారి సంధ్య, నాయకులు పాల్గొన్నారు.