నవాబ్‌పేట, జూన్ 1 : దైవ చింతనతోనే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గురుకుంట గ్రామంలో రెండ్రోజులుగా బొడ్రాయి, మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఎంఎస్ఎన్ ఫార్మా అ ధినేత ఎంఎస్ఎన్.రెడ్డితో కలిసి ఎంపీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య బొడ్రాయి, మై సమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన జరిపారు. అనంతరం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మన్నె, ఎంఎస్ఎన్.రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చె ప్పారు. ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగినందుకుగా నూ సంతోషంతో గ్రామీణ ప్రాంతాల్లో బొడ్రాయి, వి గ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్దఎత్తున ఉత్సవాలు జరగడం ఆనందంగా ఉందన్నా రు.
ప్రజలు, బంధువులు, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గురుకుంట గ్రామం భక్తి భావంతో పులకించిపోయింది. సాయంత్రం నిర్వహంచిన బోనాల ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ అనిత, సింగిల్‌విండో డైరెక్టర్ ప్రతా ప్, నాయకులు గాండ్ల రవి, శ్రీనివాస్, పురుషోత్తం, జంగయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.