ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతివరకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నామనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు.
అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, జూన్ 1 : ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 8వ తరగతివరకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తున్నామనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇంటిం టి సర్వే నిర్వహించి బడిఈడు పిల్లలను గుర్తించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న విద్యపై కరపత్రాలను పం పిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామ పెద్దలు, పూర్వవిద్యార్థులను పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు అందరి సహకారం తీసుకోవాలని తెలిపారు. అలాగే గ్రామవిద్య రిజిస్టర్ను అప్డేట్ చే యాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాల లేదా భవిత కేంద్రాల్లో చేర్పించాలని సూ చించారు. బడిబయటి పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బడిబాట కార్యక్రమంలో కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు. హరితహా రం కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీ సుకుపోవాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్వో గంగిరెడ్డి, డీఈవో ఉషారాణి, డీఆర్డీవో యాదయ్య ఉన్నారు.