మహబూబ్‌నగర్, మే 31 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : ప్రతి జిల్లాలో కోర్టులు ఏర్పాటు కానున్నాయి. భవనాలకు అవసరమైన స్థలాలను సైతం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవి నిర్మాణమయ్యే వరకు ప్రస్తుత జిల్లా కోర్టు భవనాల్లోనే కొనసాగించాలని ఆదేశించింది. రేపటి నుంచి కొత్త కోర్టులు ప్రారంభం కావడంతోపాటు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. కొత్త జడ్జీల నియామకం చేపట్టనున్నారు. ఇకపై న్యాయ సేవలు త్వరగా అందనుండడంతోపాటు పెండింగ్కేసులకూ మోక్షం లభించనున్నది.
న్యా యవాదులకు, కక్షిదారులకు న్యాయసేవలు సులభం గా అందించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూ ర్తి చేసేందుకు జిల్లా కోర్టులను ఏర్పాటు చే స్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రతి జిల్లాలో జిల్లా కోర్టులను ఏ ర్పాటు చేస్తూ వాటికి అవసరమైన స్థలాలను సైతం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త భవనాలను నిర్మించే వరకు ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టుల్లోనే రేపటి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు జిల్లా జడ్జీలను నియమిస్తూ 31 మే 22 ద్వారా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
కొత్త కోర్టుల ఏర్పాటుతో ఇకపై జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల కక్షిదారులు కోర్టు పనుల కోసం మహబూబ్‌నగర్ రావాల్సిన అవసరం లేదు.
ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లే కొత్తగా కోర్టులు కూడా ఏర్పాటు కానున్నాయి.
జ్యుడీషియల్ జిల్లాల ఏర్పాటు..
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో 33 జ్యుడీషియల్ జిల్లా కోర్టుల ఏ ర్పాటుకు అంకురార్పణ పడింది. సుప్రీంకోర్టు ప్ర ధాన న్యాయమూర్తి ఎల్.రమణతో ఇటీవల జ రిగిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర అవతరణ, రెవెన్యూ జిల్లాల ఏర్పాటు పూర్తికావడంతోపాటు జ్యుడీషియల్ జిల్లాల ప్రక్రియను ప్రారంభించాల ని సీఎం విన్నవించారు. దీంతో స్పందించిన చీఫ్ జస్టిస్ ఎన్.వీ.రమణ జ్యుడీషియల్ కోర్టుల ఏ ర్పాటుకు హైకోర్టును ఆదేశించారు. దీంతో రాష్ట్రం లో 33 జ్యుడీషియల్ కోర్టుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. అందులో భాగంగా ఉమ్మడి మ హబూబ్‌నగర్ జిల్లాలో జూన్ 2న ఐదు జిల్లా అదనపు కోర్టులు ప్రారంభంకానున్నాయి.
వనపర్తి జ్యుడీషియల్ కోర్టు పరిధి..
వనపర్తి రెవెన్యూ జిల్లాగా మారిన తరువాత జూన్ 2 నుంచి జ్యుడీషియల్ జిల్లాగా ఏర్పాటు కా నున్నది. జిల్లా ఏర్పాటయ్యాక గద్వాల పరిధిలో ఆత్మకూర్, అమరచింత మండలాలు, నాగర్‌కర్నూల్ పరిధిలో పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలు, నాగర్‌కర్నూల్ పరిధిలో గోపాల్పేట మండలం ఉన్నది. రెవెన్యూ జిల్లాలు ఏ ర్పాటయ్యాక ఈ ప్రాంతాలన్నీ వనపర్తిలో క లిశాయి. దీంతో జూన్ 2 నుంచి ఆత్మకూర్, అమరచింత, పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల, గోపాల్పేట మండలాలు వనపర్తి జ్యుడీషియల్ పరిధిలోకి రానున్నాయి. కొల్లాపూర్ కూడా జూనియర్ సివిల్ జడ్జి పరిధి నుంచి వనపర్తి జూనియర్ సివిల్ జడ్జిలోకి చేరనున్నది.
దశాబ్దాల కల సాకారం..
అదనపు కోర్టులు, సీనియర్, జూనియర్ సివిల్ కోర్టులు వనపర్తి జిల్లాలో ఉండగా.. గోపాల్పేట మండలం మాత్రం 1988 నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఉండిపోయింది. వనపర్తి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. 40 ఏండ్ల నుంచి గోపాల్పేట మండల ప్రజలు కోర్టు సమస్యలు ఉంటే నాగర్‌కర్నూల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అడ్డాకుల మండలం వనపర్తి జిల్లాలో ఉన్నా.. ప్ర జలు, న్యాయవాదుల అభ్యర్థుల మేరకు మహబూబ్‌నగర్‌లో కలిపారు. కానీ, గోపాల్‌పేటను వ నపర్తి కోర్టులో కలపాల్సి ఉండ గా.. అప్పటి మం త్రి తిరస్కరణతో నాగర్‌కర్నూల్ పరిధిలోనే ఉండిపోయినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ రెవెన్యూ జిల్లా పరిధిలో ఉన్న మండలాలను జ్యుడీషియల్ జిల్లా కోర్టులో కలపడంతో ప్రజలు, కక్షిదారులకు సత్వర పరిష్కారం దొరకనున్నది.
వనపర్తి జిల్లాలోని కోర్టులు..
వనపర్తి జిల్లాలో 4 జూనియర్ సివిల్ జడ్జి, ఒకటి సీనియర్ సివిల్ జడ్జి, పోక్సో, అదనపు జిల్లా కోర్టు కలిపి మొత్తం ఏడు ఉన్నాయి. ఇదిలా ఉండ గా, మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో ఆర్అండ్బీ అ ధికారులతో మాట్లాడి జిల్లాలో నూతనంగా ఏ ర్పాటు కానున్న జిల్లా జడ్జి కోర్టుకు ప్రభుత్వ భ వనాన్ని కేటాయించారు. 33 జిల్లాల్లో కోర్టులన్నీ అద్దె భవనంలో కొనసాగనునప్పటికీ.. వనపర్తిలో మాత్రం ప్రభుత్వ భవనం ఉండడం గమనార్హం.
సీఎం చొరవతో ఏర్పాటు..
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో జ్యుడీషియ ల్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. సీఎంకు కృ తజ్ఞతలు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవతో ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ వారితో మా ట్లాడి జిల్లా కోర్టుకు అధునాతన హంగులతో కూడిన భవనాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ జిల్లాల ఏర్పాటుతో కేసులు త్వరిగతిన పరిష్కా రం కానున్నాయి. కక్షిదారులు, న్యాయవాదులకు ఎంతో ఉపయో గకరంగా ఉంటుంది.
– భక్షి చంద్రశేఖర్‌రావు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
అదృష్టంగా భావిస్తున్నా..
రెవెన్యూ జిల్లాలను జ్యూడీషియల్ జిల్లాలుగా పునర్ విభజన చేస్తూ కేటాయించారు. గద్వాల పరిధిలోని చిన్నచింతకుంట, అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, మదనాపురం మండలాలకు చెందిన కక్షిదారులు జిల్లా కోర్టు ఏర్పాటుతో వనపర్తి జిల్లాకు రానున్నారు. గోపాల్పేట, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు కూడా వనపర్తి జిల్లా కోర్టు పరిధిలోకి వస్తాయి. దీంతో న్యాయవాదులకు కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ , గద్వాలకు వెళ్లే అవసరం ఉండదు. 1988 నుంచి అనేక వినతుల ఫలితంగా గోపాల్పేట మండలం ఎట్టకేలకు వనపర్తి జిల్లాలో కలిసింది. దీంతో ప్రజలు, న్యాయవాదులుకు అనువుగా ఉంటుంది. జ్యూడీషియల్ జిల్లా ఏర్పాటును అదృష్టంగా భావిస్తున్నా.
– భరత్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు