Ahmedabad | పెళ్లి వేడుకలో చిందులు.. విదేశీ మద్యం, హుక్కా.. 81 మంది అరెస్టు
Ahmedabad : మ్యారేజ్ యానివర్సరీ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, పిల్లలతో ఆనందంగా జరుపుకొంటారు. కానీ, గుజరాత్, అహ్మదాబాద్‌లో మాత్రం ఒక జంట ఇల్లీగల్ పార్టీగా మార్చింది.
Ahmedabad : మ్యారేజ్ యానివర్సరీ అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, పిల్లలతో ఆనందంగా జరుపుకొంటారు. కానీ, గుజరాత్, అహ్మదాబాద్‌లో మాత్రం ఒక జంట ఇల్లీగల్ పార్టీగా మార్చింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ మద్యం, హుక్కా వంటివి అందించారు. అహ్మదాబాద్‌లోని నిర్వాణ గ్రీన్ వీకెండ్ హోమ్స్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ లగ్జరీ, ఇల్లీగల్ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇక్కడ ఒక సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ పార్టీ జరిగింది. ఇది రూల్స్‌కు విరుద్ధంగా జరుగుతున్న పార్టీ అని రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ వేడుక జరుగుతున్న ప్రదేశంపై దాడులు చేశారు. అక్కడ భారీగా విదేశీ మద్యం సరఫరా చేస్తున్నారు. అలాగే గెస్టులు హుక్కా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి వద్ద నుంచి పోలీసులు పలు విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా మెటీరియల్, లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సిటీలోని డాక్టర్లు, వ్యాపారవేత్తలు, బిల్డర్లు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో ఎక్కువమంది దాదాపు 35-45 ఏళ్ల వయసున్న వాళ్లే. 43 మంది మగవారు, 38 మంది మహిళలున్నారు. మొత్తం 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో మగవారిని టెస్టుల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. ఆడవారికి లీగల్ నోటీసులు ఇచ్చి వదిలేశారు.
అందరూ సంపన్నవర్గాలకు చెందినవారే కావడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పార్టీని ఎవరు హోస్ట్ చేశారు.. ఈవెంట్ నిర్వహించింది ఎవరు.. ఇంకా ఏయే పదార్థాలు అందించారు వంటి అంశాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఇల్లీగల్ పార్టీలు ఎక్కువ కావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

