నర్వ, మే 31: ఉందేకోడ్ సర్పంచ్ నెల్లూరి పావని సోమవారం రాత్రి తన రెండో కాన్పుకై నర్వ ప్రభుత్వ దవాఖానను ఆశ్రయించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు మారాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అధునాతన సదుపాయాలను కల్పించింది. దవాఖాన సిబ్బంది మంగళవారం కేసీఆర్ కిట్‌ను అందించి పావనిని అభినందించారు. సర్పంచ్ పావని తన మొదటి కాన్పు కూడా ప్రభుత్వ దవాఖానలోనే చేసుకోవడం విశేషం.