కోయిలకొండ, మే 31: గ్రామంలోని ప్రజలందరూ పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలని తాసిల్దార్ ప్రేమ్‌రాజ్, ఎంపీడీవో జయరాం అన్నారు. మండలంలోని కేశ్వాపూర్లో మంగళవారం ఏర్పాటు చేసిన పౌరహక్కుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. గ్రామంలో రెండు గ్లాసుల పద్ధతి ఉండొద్దని, అందరూ కలసి ఉండాలని సూచించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులుపై సమీక్షించారు. పారుపల్లిలో జరుగుతున్న క్రీడామైదానం పనులను అధికారులు పరిశీలించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సర్పంచులు మొగులయ్య, మాణిక్యమ్మ, ఉపసర్పంచ్ రవీందర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మే 31: పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ సుశీల అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, ఎంపీడీవో లక్ష్మీదేవి, డీటీ భరత్, శంకర్‌నాయక్, మహిపాల్‌రెడ్డి, పుల్లారెడ్డి, రామకృష్ణగౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
హక్కులకు భంగం కలిగిస్తే చర్యలు
మిడ్జిల్, మే 31: అన్నికులాల వారు సోదరాభావంతో మెలగాలని ఆర్ఐ రామాంజనేయులు అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులకు భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని గుర్తుచేశారు. గ్రామాల్లో బాల్య వివాహాలు అరికట్టాలని సూచించారు. మూఢనమ్మకాలను వీడాలని తెలిపారు. అనంతరం అధికారులు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింబ్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు రాములు, సుదర్శన్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.