మరికల్, మే 31 : వర్షాకాలం ప్రారంభంతో ప్రభుత్వం చేపట్టే హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీకళారెడ్డి అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. స మావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సమావేశాలకు మండలస్థాయి అధికారులు ఎందుకు రావడం లేదని, ప్ర జాప్రతినిధుల సభకు అధికారులు రాకుంటే ఎలా అని ప్ర శ్నించారు. అధికారుల గైర్హాజరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని సమావేశాలకు కొత్త మంది అధికారు లు మాత్రమే హాజరు కావడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారంలో మొక్కలు నాటాలని, వాటిని సం రక్షించాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత కచ్చితంగా ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రీ గార్డు లేకపోవడంతో మొక్కలను పశువులు తింటున్నాయన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ అధికారికి సూ చించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అం దుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. రైతులు ఎక్కువగా పత్తి విత్తనాలు వేయడం వల్ల నకిలీవి విక్రయిస్తే పోలీసులు, వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని స ర్పంచులు, ఎంపీటీసీలకు ఎమ్మెల్యేలు సూచించారు. పం డ్లు, ఆయిల్ సాగుపై రైతులకు అధికారులు అవగాహన కా ర్యక్రమాలు నిర్వహించాలని, సాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టు పరిశ్రమను దళితబంధు పథకం లో అమలు చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యేలు సూచించారు.
వైన్ షాపును తొలగించాలి
ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ఉన్న వైన్ షాపును తొలగించాలని మండల సమావేశంలో మరికల్ సర్పంచ్ గోవర్ధన్ అధికారులను కోరారు. వైన్ షాపునకు కనీసం వ్యాపా ర లైసెన్సు తీసుకోకుండా నిర్వహిస్త్తున్నారన్నారు. పాఠశాల వద్ద ఉన్న వైన్ షాపును మరో చోటుకు తరలించాలన్నారు.
సర్పంచులు, ఎంపీటీసీల నిర్లక్ష్యం
సమావేశాలకు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు రాకపోవడంతో మండల సర్వసభ్య సమావేశంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం లో పాల్గొన్న కొందరు కూడా మొక్కుబడిగా వచ్చి వెళ్లారు. తమ తమ గ్రామాల్లోని సమస్యలపై చర్చించకుండానే స ర్పంచులు, ఎంపీటీసీలు వెళ్లిపోవడంతో పంచాయతీ కార్యదర్శులు మాత్రమే చివరి వరకు ఉన్నారు.
సమావేశంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ సురేఖారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు వాహిద్, వైస్ ఎంపీపీ రవికుమార్ యా దవ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ సంపత్ కు మార్, ఎంపీడీవో యశోదమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.