నారాయణపేట, మే 31 : పట్టణంలోని పళ్లలో ఉన్న పో ల్కమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్ర త్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు బోనాలతో ఆలయం వద్దకు చేరుకొని నైవేద్యంగా సమర్పించడంతోపాటు మొక్కులు చె ల్లించుకున్నారు. ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉ న్నారు. అదేవిధంగా పట్టణంలోని 3వ వార్డు శ్రీనగర్ కాలనీలోని తాయమ్మ ఆలయంలో అమ్మవారి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్ర త్యేకంగా అలంకరించి అభిషేకం, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమా లు నిర్వహించారు. అనంతరం భక్తులకు అ న్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు, మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
మారెమ్మదేవి ఉత్సవాలు
కృష్ణ, మే 31 : మండలంలోని గుడెబల్లూర్‌లో మంగళవారం గ్రామ దేవత మారెమ్మదేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనాలతో ఆలయం వద్దకు చేరుకొని నైవేద్యంగా సమర్పించడంతోపాటు మొక్కులు చె ల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తు లు గ్రామం నుంచి పెద్దఎత్తున ఊరేగింపుగా వెళ్లి కృష్ణా నది నుంచి నీళ్లను తీసుకొచ్చి అమ్మవారికి జలాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం లో భజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, మహిళలు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా గజలమ్మ జాతర
నారాయణపేట రూరల్, మే 31 : మండలంలోని జా జాపూర్‌లో మంగళవారం గజలమ్మ జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మొళగన్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్ర్తాలను చౌడేశ్వరి ఆలయం నుంచి గజలమ్మ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. మహిళలు బోనాలతో ఆలయం వద్దకు చేరుకొని నైవేద్యం గా సమర్పించడంతోపాటు మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.