అయిజ, మే 28 : టీఆర్ఎస్ సీనియ ర్ రాష్ట్ర నేత, దివంగత తిరుమల్‌రెడ్డి ఆ శయ సాధనకు అభిమానులు, కార్యకర్త లు పట్టుదలతో కృషి చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు పిలుపునిచ్చా రు. 40 ఏండ్లు నడిగడ్డ అభివృద్ధికి ఆయ న శక్తివంచనతో కృషి చేశాడన్నారు. అ హర్నిశలు శ్రమిస్తూ పార్టీకి, నాయకుల కు ఎంతో సేవచేశాడని కొనియాడారు. తిరుమల్‌రెడ్డి వారసుడు గౌతమ్‌రెడ్డికి పార్టీశ్రేణులు గౌరవం ఇవ్వాలని కోరా రు. శనివారం మండలంలోని ఉత్తనూర్ గ్రామంలో ఎమ్మెల్యేలు అబ్రహం, బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఎంపీ తిరుమల్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల్‌రెడ్డి ఎంపీపీ, జెడ్పీటీసీ, ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశాడన్నారు. ఉత్తనూ ర్ గ్రామాన్ని అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాలోనే ముందుంచారన్నారు.
ఉత్తనూర్ లో ఆయన జన్మించడం గ్రామవాసులు చేసుకున్న పుణ్యమన్నారు. తిరుమల్‌రెడ్డి జ్ఞాపకాలు, అభివృద్ధి మనకు కనబడుతుందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ తిరుమల్‌రెడ్డి ఎప్పుడు కలిసినా అయిజ పట్టణ, మం డల అభివృద్ధి గురించే చర్చించేవారని పే ర్కొన్నారు. ఆయన తనయుడుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అం దించాలని అభిమానులు, నాయకులు, కార్యకర్తలను కోరారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తిరుమల్‌రెడ్డిని సోదరుడిగా భావించి ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఉత్తనూర్ గ్రామాభివృద్ధితోపాటు జిల్లా అభివృద్ధికి ఎన్నో సలహా లు, సూచనలు అందించారని గుర్తు చే శారు. కార్యక్రమంలో తిరుమల్‌రెడ్డి తనయుడు పులకుర్తి గౌతమ్‌రెడ్డి, సర్పంచులు సుదర్శనమ్మ, బండ్ల జ్యోతి, హ న్మంతు, ఎంపీపీలు విజయ్, రాజారెడ్డి, వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కరుణ, విండో చైర్మన్లు సుభాన్, గోపాల్‌రెడ్డి, జె డ్పీటీసీ సుగుణమ్మ, అయిజ మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహులు, జోగుళాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ధ ర్మకర్త గోవర్ధన్, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, మాజీ ఎంపీపీలు సుందర్రాజు, సీతారాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, విండో మాజీ అధ్యక్షుడు రాము డు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షు లు రఘునాథరెడ్డి, మహబూబ్ పాషా, టీఆర్ఎస్ నాయకులు అజయ్, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, పెద్ద బుజ్జి ఉన్నారు.