కోస్గి, మే 11 : బల్దియా పరిధిలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచాలని లేకుంటే స హించేది లేదని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కాంట్రాక్టర్‌తో పనులు పూర్తిచేయించాలని పేర్కొన్నారు. 15 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలన్నారు. ఎక్కడా ఎవరూ నిర్లక్ష్యం వహించిన సహించేది లేదన్నారు.
పనుల పరిశీలన
ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పలు అభివృద్ధి పనులను తిరిగి పరిశీలించారు. స్థానిక ఎద్దుల బజార్ వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించారు. కళాశాల పక్కనున్న ఖాళీస్థలం లో ప్రహరీ నిర్మించి విద్యార్థులకు మై దానాన్ని తయారు చేయాలన్నారు. అ నంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ని తరగతి గదులను పరిశీలించారు. శి థిలావస్థలో ఉన్న గదులను తొలగించాలన్నారు. మరో రెండు గదులు మరమ్మతులు చేస్తే వాడుకలోకి వస్తాయని, ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో వాటిని మరమ్మతు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్ర భుత్వ కళాశాల మైదానాన్ని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రహరీ ని ర్మించి మైదానాన్ని సుందరీకరించేందుకు ప్రణాళిక తయా రు చేయాలన్నారు.
గ్రంథాలయ భవన నిర్మాణానికి హార్టికల్చర్ కార్యాలయ వెనుక భాగంలో స్థలాన్ని పరిశీలించా రు. అక్కడ గ్రంథాలయ నిర్మాణం చేపడుదామని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కూరగాయల షెడ్లను పరిశీలించారు. పక్కనున్న మరుగుదొడ్లను తీసివేయాలని మున్సిప ల్ చైర్పర్సన్, అధికారులను ఆదేశించారు. రూ.కోటితో దం డం చెరువు కాల్వ నిర్మాణానికి కలెక్టర్, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మున్సిపల్ భవన నిర్మాణాన్ని పరిశీలించి ప లు మార్పులు సూచించారు. అనంతరం ఉపసముద్ర చెరు వు వద్ద రోడ్డు పనులను ఎలా చేపట్టాలన్న అంశంపై ఏఈ తో మాట్లాడారు. శ్మశానవాటిక వద్ద గ్రేవ్ యార్డ్ పనులను పరిశీలించారు. పనుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.