బాలానగర్, మే 1: కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పథకాలను అమలు చేస్తున్నదని గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండలకేంద్రం లో జెండాను ఎగురవేశారు. అనంతరం కార్మికులను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ వెంకటాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, యూత్వింగ్ మండల అధ్యక్షుడు ప్రకాశ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేశ్, శివానందరెడ్డి, మధు, సింగిల్‌విండో డైరెక్టర్లు మంజూనాయక్, యాదయ్య, సర్పంచుల సంఘం మండల ప్రధానకార్యదర్శి శంకర్, ఉపసర్పంచ్ గిరిధర్‌రావు, నాయకులు బాలూనాయక్, పురందాస్నాయక్, శ్రీకాంత్, కృష్ణ, బాలయ్య, సాయిలు, నరేందర్ పాల్గొన్నారు.
కార్మికులకు సర్కారు అండ
జడ్చర్లటౌన్, మే 1 : కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నదని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌యార్డులో టీఆర్ఎస్కేవీ, అ నుబంధ సంస్థలు, హమాలీ సంఘం ఆధ్వర్యంలో జెండా ను ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి టీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా త్రీవీర్ యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, గాంధీ ట్రస్టు వద్ద సీనియర్ నాయకుడు చాంద్‌ఖాన్ టీఆర్ఎస్కేవీ జెండాలను ఎగురవేశారు. అదేవిధంగా సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంతోపాటు పలు గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. కార్యక్రమాల్లో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్‌గౌడ్, మాలిక్‌షాకీర్, రామ్మోహన్, విజయ్‌కుమార్, సర్ధార్, ఖాదర్, శంకర్, మల్లేశ్, నాగభూషణం, శ్రీశైలం, సాయి, సీపీఎం, సీఐటీయూ నాయకులు పి.జగన్, పరశురాం, కురుమూర్తి, రమేశ్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
భూత్పూర్, మే 1 : కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. మేడే వేడుకలను పురస్కరించుకొని భూత్పూర్, అమిస్తాపూర్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ లో ఏఐటీయూసీ కార్యాలయ భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్‌రాం, జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్, మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, తిరుపతయ్య, నర్సింహులు, గౌస్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో..
మహబూబ్‌నగర్‌టౌన్, మే 1 : మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. మేడేను పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చంద్రకాంత్, ఎర్ర నర్సింహులు, బాలరాజు పాల్గొన్నారు. అదేవిధంగా ఐఎఫ్టీయూ ఆటో యూనియన్ ఆధ్వరంలో నాలుగోవార్డు ఎదిర లో కార్మిక జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, హన్మంతు, ఎల్లయ్య, వెంకటయ్యగౌడ్, పెద్దకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, మురళి, వెంకటయ్య, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, మే 1 : మండలంలోని మల్కాపూర్, కొత్లాబాద్, ఇబ్రహీంనగర్, పార్పల్లి గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుమలయ్య కార్మిక జెండాను ఎగురవేశారు. కార్మికులకు పనికితగ్గ వేతనాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.
కేంద్రం తీరుతో కార్మికులకు నష్టం
మహబూబ్‌నగర్/మెట్టుగడ్డ, మే 1 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికులకు తీవ్రనష్టం వాటిల్లుతున్నదని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తే సహించమన్నారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. కార్మికులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ తాటి గణేశ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి, టీఆర్ఎస్కేవీ ప్రభుత్వ దవాఖాన అధ్యక్షుడు గణేశ్, కార్యదర్శి సురేశ్, వవన్కల్యాణ్గౌడ్, మెడికల్ కళాశాల టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు బాలరాజు, నాగరాజు, శంకర్, చంద్రశేఖర్, యాదయ్య, చందుయాదవ్ పాల్గొన్నారు. అదేవిధంగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం, కోశాధికారి వెంకటేశ్, దాసు, నర్సింహులు, శేఖర్, వెంకట్రాములు, సీతారం, చెన్నయ్య, కృష్ణ, నారాయణ, వెంకటయ్య, నర్సిహులు, విష్ణు, అనిల్, నితీశ్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల, మూసాపేట మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), మే 1 : కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలకేంద్రంతోపాటు కందూరు తదితర గ్రామాల్లో కార్మిక జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మూసాపేట మండలకేంద్రంతోపాటు పలు గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కార్మిక జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మే 1 : మండలకేంద్రంతోపాటు గూరకొండ, వెంకటాయపల్లి, డోకూర్, మీనిగోనిపల్లి, వెంకటగిరి, వెంకంపల్లి గ్రామాల్లో మేడే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్బంగా సీఐటీయూ, ఐఎఫ్టీయూ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కార్మిక జెండాలను ఎగురవేశారు.
ఉమ్మడి గండీడ్ మండలంలో..
గండీడ్, మే 1 : ఉమ్మడి గండీడ్ మండలంలో భవన నిర్మా ణ కార్మికులు మేడే వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కార్మిక జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచులు పుల్లారెడ్డి, జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు రేణుక, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మే 1 : మండలకేంద్రంలో వివిధ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రాము లు మాట్లాడుతూ హక్కుల సాధనకు కార్మికులు కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మికుల శ్రేయస్సు కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గౌస్, పీఏసీసీఎస్ వైస్‌చైర్మన్ అల్వాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్‌రెడ్డి, మల్లేశ్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, హమాలీ సంఘం అధ్యక్షుడు ఆనంద్, నర్మద, యాదయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.