‘కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచినందుకు పాదయాత్ర చేస్తున్నావా బండి సంజయ్’ అంటూ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం మహబూబ్‌నగర్,హన్వాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కులమతాల పేరుమీద చేస్తున్న రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వ్యవసాయ మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు.
హన్వాడ, ఏప్రిల్ 28 : కేంద్ర ప్రభుత్వం పె ట్రోల్, డీజిల్, వంటగ్యా స్ పెంచినందుకు పాదయాత్ర చేస్తున్నావా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీ నివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం మండలంలోని గొండ్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బండి పాదయాత్రతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. కులమతా ల పేరుమీద చేస్తున్న రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వ్యవసాయ మోటర్లకు కేంద్రం మీటర్లు పెట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు. మండలంలో ఏ గ్రామంలో కూడా నీటి సమస్య ఉండొద్దని అధికారులను ఆదేశించారు. నెలలోగా కూరగాయల మార్కెట్, ఓపెన్ జిమ్, రైతుబజార్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం హన్వాడలో ముస్లింలకు ప్రభుత్వ తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముస్లింలకు తోఫా పంపిణీచేసి విందు ఆరగించారు. ఈద్గా చుట్టూ ప్రహరీ నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, జెడ్పీటీసీ విజయనిర్మల, ఏపీఎం సుదర్శన్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచులు వెంకటయ్య, రేవతి, నాయకులు రాజుయాదవ్, బాలయ్య, లక్ష్మయ్య, సత్యం, అన్వర్, సుదర్శన్, ఆశన్న, యాదయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు లేవు..
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28 : మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ ఉచితంగా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ కార్యాలయాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. గతంలో జిల్లా కేంద్రంలో కార్యాలయాలు అరకొర వసతులతో ఉండేవని, నేడు సకల సౌకర్యాలతో నిర్మించినట్లు తెలిపారు. కలేక్టరేట్ నిర్మాణం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి గ్రామంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ అధికారుల ఫోన్ నంబర్లను ప్రదర్శించాలని ఎస్ఈ వెంకటరమణను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, మిషన్ భగీరథ ఈఈ వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి వలసలు..
మహబూబ్‌నగర్ రూరల్, ఏప్రిల్ 28 : అభివృద్ధిని చూ సి వివిధ పార్టీ నాయకులు టీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మండలంలోని దివిటిపల్లి గ్రామంలో బీజేపీకి చెందిన వార్డు మెంబర్ జి.శ్రీను మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం శాంతమ్మనారాయణ జ్ఞాపకార్థంతో ఏర్పాటు చేసిన అంబలి కేం ద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ అనిత, సర్పంచ్ జరీనాబేగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జి ఉపసర్పంచ్ వేమ, నాయకుడు పాండురంగారెడ్డి తదితరులున్నారు.
చదువుతోనే బంగారు భవిష్యత్తు
మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 28 : చదువుతోనే బం గారు భవిష్యత్తు ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో వార్షికోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే అదనపు గదులు ఏర్పాటు చేశామన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్, ఒకేషనల్ విద్యార్థులకు సైతం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అ నంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ప్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ప్రా రంభించారు. కార్యక్రమంలో పీయూ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్, ఎన్టీఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ప ద్మావతి, కౌసర్ జహాన్, కౌన్సిలర్ రామ్, అధ్యాపకులు అమీనముంతాజ్, పు ష్పలత, విజయలక్ష్మి, కరుణశ్రీ, న ర్సింహారెడ్డి, గంగధార్, సూరయ్యజాబిన్, సీపీడీసీ సభ్యు డు నాగేంద్రస్వామి, బాలరంగయ్య పాల్గొన్నారు.